ధోనీ జెర్సీ నెంబర్ ఎవరికి దక్కనుంది?

By telugu teamFirst Published Jul 25, 2019, 11:34 AM IST
Highlights

 వచ్చే నెల మొదటి వారంలో ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సీరిస్ లో తలపడనున్నారు. అయితే... ఈ మ్యాచ్ లో రెండు జట్లు తెలుపు రంగు జెర్సీలపై నంబర్లు, తమ పేర్లతో బరిలోకి దిగనున్నాయి. టెస్టు క్రికెట్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. భారత్- వెస్టిండీస్ మ్యాచ్ లోనూ క్రికెటర్లు తెలుపు రంగు జెర్సీలు ధరించనున్నారు.
 


ధోనీ జెర్సీ నెంబర్ ఎంత అని క్రికెట్ అభిమానిని ఎవరిని అడిగినా వెంటనే 7 అని చెప్పేస్తారు. కాగా... ఇప్పుడు ఆ జెర్సీ నెంబర్ మరో క్రికెటర్ దక్కనుందా..? అవుననే సమాధానం ఎక్కువగా వినపడుతోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. వచ్చే నెల మొదటి వారంలో ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సీరిస్ లో తలపడనున్నారు. అయితే... ఈ మ్యాచ్ లో రెండు జట్లు తెలుపు రంగు జెర్సీలపై నంబర్లు, తమ పేర్లతో బరిలోకి దిగనున్నాయి. టెస్టు క్రికెట్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. భారత్- వెస్టిండీస్ మ్యాచ్ లోనూ క్రికెటర్లు తెలుపు రంగు జెర్సీలు ధరించనున్నారు.

వన్డేలు, టీ20ల్లో భారత ఆటగాళ్లే ఏ నెంబర్ తో ఆడుతున్నారో... ఆ నెంబర్ తోనే టెస్టుల్లో కూడా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 18, రోహిత్45వ నెంబర్ ని వినియోగించనున్నారు. ఇప్పుడు చర్చంతా ధోనీ జెర్సీ నెంబర్ పైనే. ఎందుకంటే 2014లో ధోనీ టెస్టు ఫార్మాట్లకు రిటైర్ అయిన సంగతి తెలిసిందే. వన్డేలు, టీ20ల్లో మాత్రం ఏడో నెంబర్ జెర్సీని ఉపయోగిస్తున్నారు.

మరి టెస్ట్ మ్యాచుల్లో ఈ నెంబర్ ని ఎవరు వినియోగిస్తారు అనే చర్చ మొదలైంది. టెస్టులకు ఏడో నెంబర్ జెర్సీ అందుబాటులో ఉన్నప్పటికీ దానిని మరో క్రికెటర్ అందించే అవకాశం చాలా తక్కువగా ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మరికొందరేమో వేరే క్రికెటర్ కి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

దీనిపై అభిమానులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ధోనీకి తన జెర్సీ నెంబర్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉందని.. దానిని మరో క్రికెటర్ కి ఇవ్వడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. మరి బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

click me!