అపార మేదస్సుతో జ్ఞానసాగర్ అద్భుతాలు... గిన్నిస్ బుక్ లో చోటు

By Arun Kumar PFirst Published Sep 27, 2019, 5:23 PM IST
Highlights

 మాస్టర్ జ్ఞానసాగర్  52 వస్తువులను వరుస క్రమంలో గుర్తుపెట్టుకుని వాటిని మళ్లీ అదే క్రమంలో అప్పచెప్పాడు. ఇలా కేవలం ఒక్కనిమిషంలోనే ఈ పని చేసి గత రికార్డులన్నింటిని బద్దలుగొట్టాడు. అతడి టాలెంట్ ను గుర్తించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ''గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్'' లో చోటు కల్పించారు. 

గ్రాండ్ మాస్టర్ జ్ఞానసాగర్ సుబ్రమణ్యన్ అంతర్జాతీయ వేదికలపై మరోసారి భారత దేశ ప్రతిష్టను మరింత పెంచాడు. పేరులోనే కాదు తనలో అపార జ్ఞానం దాగుందని అతడు తాజా ప్రదర్శన ద్వారా నిరూపించాడు. ఇలా అతిచిన్న వయసులోనే మల్టీ టాలెంట్ ప్రదర్శనతో అద్భుతాలు సృష్టిస్తున్న అతడు తాజాగా  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్  లో చోటు దక్కించుకున్నాడు.  

మాస్టర్ జ్ఞానసాగర్  52 వస్తువులను వరుస క్రమంలో గుర్తుపెట్టుకుని వాటిని మళ్లీ అదే క్రమంలో అప్పచెప్పాడు. ఇలా కేవలం ఒక్కనిమిషంలోనే ఈ పని చేసి గత రికార్డులన్నింటిని బద్దలుగొట్టాడు. అతడి టాలెంట్ ను గుర్తించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ లో చోటు కల్పించారు. 

చిన్న వయసులోనే జ్ఞానసాగర్ వివిధ రంగాల్లో ప్రావీణ్యం సాధించాడు. మెమోరీ జీనియస్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ లో అతడు గతంలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఫిన్ లాండ్ వేదికన 2007 లో జరిగిన ఓ కాంటెస్ట్ లో భారత్ తరపున పాల్గొన్న అతడు వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.దీంతో అతడి ప్రతిభకు మెచ్చి మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం అతన్ని ప్రశంసించారు. 

హైదరాబాద్ లో నివాసముంటున్న అనిల్ అవుచి-రూపాల తనయుడు జ్ఞానసాగర్ 2013-14 నుండి గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి వద్ద మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నాడు. జయంత్  పర్యవేక్షణలో అతడు కేవలం పిజికల్ గానే కాకుండా మెంటల్ గా కూడా రాటుదేలాడు. మొదట రీజనల్ తైక్వాండో ఫోటీల్లో సత్తాచాటిన జ్ఞానసాగర్ ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అలా తాజాగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకునే స్థాయికి అతడి ప్రస్థానం సాగింది. భవిష్యత్ లో ఈ యువ క్రీడాకారుడి నుండి మరిన్ని అద్బుతాలను ఆశించవచ్చని అతడి గురువు జయంత్ రెడ్డి తెలిపారు.

click me!