హార్దిక్ ని బ్రదర్ అన్న టీవీ నటి.. నెటిజన్ల ట్రోల్స్

By telugu teamFirst Published May 6, 2019, 1:06 PM IST
Highlights

టీం ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి నెటిజన్ల ట్రోల్స్ బారిన పడ్డాడు. కాఫీ విత్ కరణ్ షోలో హార్దిక్ చేసిన కామెంట్స్... అతన్ని ఇప్పట్లో వదిలేలాలేవు. 


టీం ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి నెటిజన్ల ట్రోల్స్ బారిన పడ్డాడు. కాఫీ విత్ కరణ్ షోలో హార్దిక్ చేసిన కామెంట్స్... అతన్ని ఇప్పట్లో వదిలేలాలేవు. ఇంతకీ మ్యాటరేంటంటే...  హిందీ సీరియల్ నటి క్రిస్టల్ డిసౌజా ఇటీవల పబ్ కి వెళ్లింది. అక్కడ టీం ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఫోటో దిగింది. ఆ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి.. ‘ మా అన్నయ్య అంతగా కష్టపడేవారు ఎవరూ లేరు’’ అనే కామెంట్ పెట్టి... ‘‘ బ్రదర్ ఫ్రమ్ ఎనదర్ మథర్’’ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది.

కాగా.. ఈ పోస్టుతో.. ఇటు హార్దిక్ పాండ్యాని, అటు క్రిస్టల్ ని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. కొందరు హార్దిక్ కాఫీ విత్ కరణ్ ఫ్రోగ్రామ్ లో స్త్రీల గురించి చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ.. పాండ్యాని ట్రోల్ చేయగా... క్రిస్టల్ మరో విధంగా ట్రోల్ చేశారు. గతంలోనూ వీరిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలను కెమేరాలకు చిక్కాయి. దీంతో.. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు క్రిస్టల్ హార్దిక్ ని బ్రదర్ అనడంతో... ట్రోల్స్ మరింత ఎక్కువ చేశారు.

బ్రదర్ ఫ్రమ్ ఎనదర్ మథర్ అనే హ్యాష్ ట్యాగ్ కి అతి దారుణంగా స్పందించారు. తల్లులు వేరైనా... తండ్రి ఒక్కడేనా అంటూ చెత్త కామెంట్స్ చేశారు. కాగా.. నెటజన్ల కామెంట్స్ ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఆ చెత్త కామెంట్స్ ఆమె సహ నటుడు అపరశక్తి ఖురానా స్పందించాడు. క్రిస్టల్ కి మద్దతుగా ట్వీట్ చేశారు.

‘‘ హార్దిక్ పాండ్యా మంచి క్రికెటర్. ఇలాంటి చెత్త కామెంట్స్ చేయడానికంటే... టీం ఇండియా కి మద్దతు ఇస్తే బాగుంటుదని’’ ట్వీట్ చేశాడు. కాగా.. తనకు మద్దతుగా నిలిచిన సహనటుడికి క్రిస్టల్ దన్యవాదాలు తెలిపింది. కాగా.. ఒక నటితో ఫోటో దిగితే ఇంత రచ్చ అవుతుందని పాపం హార్దిక్ కూడా ఊహించి ఉండడు. 

click me!