కెన్యా అథ్లెట్ అనుమానాస్పద మృతి..!

By telugu news teamFirst Published Oct 14, 2021, 9:11 AM IST
Highlights

మంగళవారం రాత్రి సమయంలో ఆగ్నెస్ టిరోప్ హత్యకు గురైనట్లు నిర్దారణకు వచ్చారు పోలీసులు. ఇక అదే సమయంలో ఆమె భర్త కనిపించకపోవడంతో అతడిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కెన్యా వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆగ్నెస్ టిరోప్ పశ్చిమ పట్టణం ఐటెన్‌లోని ఆమె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. 

హత్యకు భర్తే కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. మంగళవారం రాత్రి సమయంలో ఆగ్నెస్ టిరోప్ హత్యకు గురైనట్లు నిర్దారణకు వచ్చారు పోలీసులు. ఇక అదే సమయంలో ఆమె భర్త కనిపించకపోవడంతో అతడిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

25 ఏళ్ల ఆగ్నెస్‌ తన నివాసంలో విగతజీవిగా పడి ఉందని, ఆమె పొట్టపై కత్తిపోట్ల ఆనవాళ్లను పోలీసులు గుర్తించారని కెన్యా అథ్లెటిక్స్‌ సమాఖ్య బుధవారం తెలిపింది. అయితే, ఆగ్నెస్‌ను భర్తే హత్యచేసి ఉంటాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
Also Read IPL2021: సూపర్ క్యాచ్.. కానీ నో బాల్ అయిపోయింది..!

కాగా హత్య జరిగిన రోజు రాత్రి నుంచి ఆగ్నెస్ టిరోప్ తండ్రి కూడా తప్పిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆగ్నెస్ టిరోప్ మృతదేహాన్ని పోలీసులు బెడ్ కింద గుర్తించారు. ఆపై కత్తిగాట్లు ఉండటంతో హత్యగా నిర్దారణకు వచ్చారు. ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. కాగా ఈమె ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లలో (2017, 2019) పది వేల మీటర్ల విభాగంలో రెండు కాంస్య పతకాలు గెలిచారు. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో 5000 మీటర్ల పరుగులో నాలుగో స్థానంలో నిలిచింది.

click me!