‘‘టీం ఇండియాకి ఈ చికెన్ పెట్టండి’’

By ramya neerukondaFirst Published Jan 3, 2019, 2:56 PM IST
Highlights

టీం ఇండియాకి గ్రిల్డ్ చికెన్ కాకుండా కఢక్ నాథ్ చికెన్ పెట్టాలని మధ్యప్రదేశ్ లోకి కృషి విజ్ఞాన కేంద్రం బీసీసీఐ కి సూచించింది.

టీం ఇండియాకి గ్రిల్డ్ చికెన్ కాకుండా కఢక్ నాథ్ చికెన్ పెట్టాలని మధ్యప్రదేశ్ లోకి కృషి విజ్ఞాన కేంద్రం బీసీసీఐ కి సూచించింది.  గ్రిల్డ్ చికెన్ కన్నా.. ఈ కఢక్ నాథ్ చికెన్ లో ఎక్కువ లాభాలు ఉన్నాయని సూచిస్తోంది. 

‘విరాట్, ఇతర జట్టు సభ్యులు తమ డైట్‌లో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటారని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్నాం. అయితే దానిలో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. దాన్ని డైట్‌లో తీసుకోవడం కంటే తక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉన్న కఢక్‌నాథ్ చికెన్‌ను వాడటం వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయి. హైదరాబాద్‌లోని నేషనల్ రిసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్ నివేదిక ప్రకారం దానిలో ప్రొటీన్లు, ఐరన్‌ పుష్కలంగా ఉన్నాయి’ అని కృషి విజ్ఞాన కేంద్రం వివరించింది.

 క్రికెట్ ఆటగాళ్లలో ఫిటెనెస్‌ గురించి చెప్పేటప్పుడు ముందుగా ప్రస్తావించేవారిలో కోహ్లీ పేరు కూడా ఉంటుంది. అయితే గతంలో వెల్లడైన కథనాల ప్రకారం..మెరుగైన ఫిట్‌నెస్‌, ఆరోగ్యం కోసం వేగాన్‌ డైట్‌కి మారినట్లు విరాట్ వెల్లడించారు. దానికోసం అతడికి ఎంతో ఇష్టమైన బటర్‌ చికెను కూడా వదిలేసినట్లు చెప్పాడు.

ఈ కఢక్ నాథ్ చికెన్.. ఎక్కువగా మధ్యప్రదేశ్ లో లభిస్తుంది. ఈ రకం కోళ్లు నల్లగా ఉంటాయి. వీటిలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. 

click me!