ప్రాక్టీస్ మ్యాచ్ లో క్రికెటర్ తలకు తీవ్రగాయం

By ramya neerukondaFirst Published Nov 1, 2018, 12:40 PM IST
Highlights

తీవ్రంగా గాయపడిన అతనిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 ప్రాక్టీస్ మ్యాచ్ లో శ్రీలంక క్రికెటర్ ఒకరు తీవ్రగాయాలపాలయ్యారు.   పాతుమ్‌ నిస్సాంకా తలకు బంతి తగిలి తీవ్ర గాయమైంది. బుధవారం లంక బోర్డ్‌ లెవన్‌తో ఇంగ్లండ్‌ జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన అతనిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ కొట్టిన ఓ బలమైన షాట్‌.. షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న నిస్సాంకా తలకు గట్టిగా తాకడంతో అతడు కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం నిస్సాంకా ఆరోగ్యం నిలకడగా ఉంది. కాగా, నిస్సాన్‌ హెల్మెట్‌కు తగిలిన బంతి కాస్తా లెగ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఏంజెలో మాథ్యూస్‌ చేతిలో పడింది. ఫలితంగా బట్లర్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. ఈ రెండు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

click me!