టీ20 ప్రపంచకప్ నుంచి జస్ప్రీత్ బుమ్రాను ఇంకా తొల‌గించ‌లేదు - బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

By team teluguFirst Published Oct 1, 2022, 9:32 AM IST
Highlights

టీ20 ప్రపంచకప్ నుంచి జస్ప్రీత్ బుమ్రాను ఇంకా తొలగించలేదని, ఆ మ్యాచ్ లలో ఆయన ఆడే అవకాశాలు ఉన్నాయని  బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ఈ మేరకు ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 
 

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ లో జస్ప్రీత్ బుమ్రాను ఇంకా తొల‌గించ‌లేద‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఈ క‌ప్ ప్రారంభానికి ఇంకా స‌మ‌యం ఉంద‌ని, కాబట్టి బుమ్రా ఆడతాడని భావించవచ్చని ఆయ‌న చెప్పారు. శుక్ర‌వారం ఓ వార్తా వెబ్‌సైట్‌తో మాట్లాడిన ఆయ‌న.. జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ కప్ నుంచి ఇంకా నిష్క్రమించలేదని, ఆ విష‌యంలో ఇప్పుడు ఏమైనా మాట్లాడ‌టం తొంద‌రే అవుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

గుడ్ న్యూస్ : పండగసీజన్ లో భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఇది రెండోసారి...

ఇటీవల త్రివేండ్రంలో జ‌రిగిన భార‌త్ -దక్షిణాఫ్రికా మొదటి T20I కి ముందు బుమ్రా వెన్నునొప్పికి గురయ్యారు. దీంతో ఆ సిరీస్ లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు. దీంతో అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ స్వదేశంలో జరిగే వైట్-బాల్ సిరీస్‌కి వచ్చారు. భారత్ 1-0తో ఆధిక్యంలో ఉన్న సిరీస్‌ను కోల్పోయిన తర్వాత, బుమ్రా స్కానింగ్ చేయించుకోవడానికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి వెళ్లారు. ప్రస్తుతం ఆయ‌న NCAలోని వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారు.

ఐపీఎల్‌ని బ్యాన్ చేస్తే అన్నీ సక్కబడతాయా... మరి వారి పరిస్థితి ఏంటి...

ఇంగ్లాండ్ భారత్ తో సిరీస్ ఆడిన తర్వాత బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్ లో పునరాగమనం చేశారు. రెండు మ్యాచ్ ల్లో ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి 12.16 ఎకానమీ రేటుతో 73 పరుగులు ఇచ్చారు.

ఒక్కో పోస్టుకి రూ.9 కోట్లు తీసుకుంటున్న కోహ్లీ... ఇన్‌స్టాలో విరాట్ సంపాదన మామూలుగా లేదుగా...

అక్టోబర్ 16న ప్రారంభమయ్యే మెగా ఈవెంట్ కు ముందు సన్నాహక శిబిరంలో పాల్గొనడానికి భారత్ అక్టోబర్ 6 (గురువారం) ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది.

బయోపిక్ మూవీకి ధోనీ ఒప్పుకోవడానికి కారణం అదే... ఆ పిల్లాడితో మాట్లాడిన తర్వాత...

అక్టోబర్ 23న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో పాకిస్థాన్ తో జ‌రిగిన తొలి సూపర్ 12 మ్యాచ్ లో తలపడే ముందు బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య భారత్ రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడ‌నుంది. చివ‌రి సారిగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో సూపర్ 12 ను అధిగమించడంలో విఫలమైన భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.
 

click me!