రోహిత్ శర్మను అధిగమించిన ధావన్... కోహ్లీ తర్వాత అతడే

By Arun Kumar PFirst Published Nov 12, 2018, 3:52 PM IST
Highlights

వెస్టిండిస్ తో జరిగిన చివరి టీ20 లో కూడా భారత జట్టు విజయం సాధించి సీరిస్ ను కైవసం చేసుకుంది. అయితే ఉత్కంటభరితంగా సాగిన చివరి మ్యాచ్ లో టీంఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చెలరేగి ఆడి జట్టును విజయతీరానికి చేర్చాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా ధావన్ ఈ క్యాలెండర్ ఇయర్ లో టీ20 మ్యాచుల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచి రికార్డు సృష్టించాడు. 
 
ఈ జాబితాలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగగా అతడి స్థానాన్ని ధావన్ ఆక్రమించాడు. చివరి టీ20లో రోహిత్ తక్కువ పరుగులకే ఔటవడం...ధావన్ 92 పరుగులతో మెరవడంతో ఈ ఘనత సాధ్యమయ్యింది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో ధావన్ ఇప్పటివరకు 572 పరుగులు సాధించాడు. అతడి తర్వాత 560 పరుగులతో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు.

ఇక మొత్తంగా ఒకే క్యాలెండర్ ఇయర్ లో టీ20ల్లో అత్యధిక పరుగుల్లో సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. 2016 సంవత్సరంలో కోహ్లీ 641 పరుగులు  సాధించాడు. అతడి తరువాతి స్థానంలో ఫకార్ జమాన్ 2018 సంవత్సరంలో 572 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మూడో స్థానంలో ధావన్,నాలుగో స్థానంలో రోహిత్ లు ఉన్నారు. 

కేవలం భారతీయ ఆటగాళ్ల విషయానికి వస్తే కోహ్లీ తర్వాతి స్థానం ధావన్‌దే. ఆస్ట్రేలియాతో డిసెంబర్ లో జరిగే టీ20 సీరిస్ లో రోహిత్, ధావన్ లు కూడా ఆడనున్నారు. దీంతో వీరిలో ఎవరైనా అత్యత్తమంగా రాణిస్తే కోహ్లీ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు

200 ఫోర్లు కొట్టిన వీరుడిగా రోహిత్ శర్మ

కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ వరల్డ్ నెంబర్ వన్.....

అడిగి మరీ తీసుకున్నాడు: కృనాల్ పాండ్యపై రోహిత్ శర్మ

సచిన్ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్ శర్మ...క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు

టెస్టు జట్టులో దక్కని చోటు: రోహిత్ శర్మ ఉద్వేగభరిత ట్వీట్

నేను ఆ స్థితిలో లేను: జట్టులో చోటుపై రోహిత్ శర్మ

ఇంటికే: రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు

ఆ ‘‘చెత్త రికార్డ్’’ రోహిత్ శర్మదే

click me!