మా టీంలో విరాట్ లేడు.. ఆసిస్ క్రికెటర్

By ramya NFirst Published Mar 7, 2019, 10:11 AM IST
Highlights

తమ జట్టులో విరాట్ కోహ్లీ లేడని.. అందుకే తాము ఓడిపోయామంటున్నాడు ఆసిస్ క్రికెటర్ కమిన్స్.

తమ జట్టులో విరాట్ కోహ్లీ లేడని.. అందుకే తాము ఓడిపోయామంటున్నాడు ఆసిస్ క్రికెటర్ కమిన్స్. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేలను టీం ఇండియా చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కమిన్స్ మీడియాతో మాట్లాడాడు.

రెండో వన్డేలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ చేసిన 116 పరుగులే రెండు జట్ల మధ్య ప్రధాన తేడా అని కమిన్స్‌ అన్నాడు. అతడు చాలా బంతులు ఎదుర్కొన్నాడని, నాణ్యమైన షాట్లు ఆడాడని పేర్కొన్నాడు. మిడిలార్డర్‌ కుదేలైనప్పటికీ 40వ శతకం బాదేసిన విరాట్‌ టీమిండియాను తిరిగి పోటీలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

‘కచ్చితంగా విరాట్‌ కోహ్లీనే తేడా. మేం మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. మార్కస్‌ స్టాయినిస్‌ అర్ధశతకం చేశాడు. శుభారంభమే లభించింది. గెలిపించే ఆటగాడు మాత్రం మాకు దొరకలేదు. టీమిండియాకు మాత్రం విరాట్‌ ఉన్నాడు. చాలా బంతులు ఎదుర్కొన్నాడు. రెండు జట్లకు అతడే తేడా. అవకాశం లేని చోట 250 స్కోరు సాధించాడు. అతడికి మేం అద్భుతమైన బంతులు వేశాం. అతడు స్పిన్‌ను ఎదుర్కొన్న తీరు ఈ వికెట్‌పై మాకైతే కష్టమే. ప్రస్తుతం ఆటపై పూర్తి పట్టున్న వ్యక్తి అతడే’ అని విరాట్‌ను కమిన్స్‌ ప్రశంసించాడు.

click me!