పంత్ తో నాకెలాంటి పోటీ లేదు.. సాహా

By ramya NFirst Published Feb 21, 2019, 12:05 PM IST
Highlights

రిషబ్ పంత్ తో తనకు ఎలాంటి పోటీ లేదని వృద్ధిమాన్ సాహా తెలిపాడు. మోచేతి గాయం కారణంగా దాదాపు పది నెలలుగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్‌ సాహా.. మళ్లీ తన పునరాగమనంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. 

రిషబ్ పంత్ తో తనకు ఎలాంటి పోటీ లేదని వృద్ధిమాన్ సాహా తెలిపాడు. మోచేతి గాయం కారణంగా దాదాపు పది నెలలుగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్‌ సాహా.. మళ్లీ తన పునరాగమనంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. 

ఈ సందర్భంగా సాహా.. మీడీయాతో మాట్లాడాడు. గాయం తర్వాత ఆటగాళ్లతో కలవడం గొప్పగా అనిపిస్తోందన్నాడు. ఒక ఆటగాడిగా తిరిగి జట్టులో అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నాడు. చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్నట్లు తనకు అనిపించలేదని.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ కు సాయం చేయడంపైనే దృష్టిపెట్టినట్లు చెప్పారు.

తాను జట్టుకు దూరమైనప్పుడు రిషబ్ పంత్ అవకాశం దక్కించుకున్నాడని చెప్పాడు. వచ్చిన అవకాశాన్ని పంత్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడన్నాడు. పంత్ ని తనకు పోటీగా ఎప్పుడూ భావించనన్నాడు. పంత్ తో తనకు మంచి సంబంధమే ఉన్నట్లు తెలిపాడు. 

ఐపీఎల్‌లో గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్ సాహా .. ఇంగ్లండ్‌లో మోచేతికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా బెంగాల్ జట్టు తరుపున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.
 

click me!