‘‘ఓవర్ చేయకు’’...పొవార్ లేనప్పుడే ఫైనల్‌కు వెళ్లాం: హర్మన్‌కు సంజయ్ కౌంటర్

By sivanagaprasad kodatiFirst Published Dec 5, 2018, 11:20 AM IST
Highlights

టీమిండియా మహిళల జట్టుకు కోచ్‌గా రమేశ్ పొవార్‌నే కొనసాగించాలంటూ భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైఎస్ కెప్టెన్ స్మృతీ మంథాన బీసీసీఐకి లేఖ రాశారు. దీనిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటుగా బదులిచ్చారు

టీమిండియా మహిళల జట్టుకు కోచ్‌గా రమేశ్ పొవార్‌నే కొనసాగించాలంటూ భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైఎస్ కెప్టెన్ స్మృతీ మంథాన బీసీసీఐకి లేఖ రాశారు. దీనిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటుగా బదులిచ్చారు.

హర్మన్ ప్రీత్ పొవార్‌ పనితనాన్ని, సమర్థతను ఎక్కువగా చేసి చూపిస్తోందని.. గతంలో పవార్ కోచ్‌గా లేనప్పుడే టీమిండియా ప్రపంచకప్‌ ఫైనల్‌కు వెళ్లిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అంతకు ముందు తాత్కాలిక కోచ్ రమేశ్ పవర్ కాంట్రాక్టు కాలం ముగియడంతో జట్టుకు కొత్త కోచ్‌ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది.

అయితే కొత్త కోచో కోసం బీసీసీఐ ప్రకటన విడుదల చేయకపోవడతో ఇక రమేశ్ పొవార్‌ శకం ముగిసినట్లేనని క్రికెటర్ వర్గాలు భావించాయి. అయితే ఆయన్నే కోచ్‌గా కొనసాగించాలంటూ హర్మన్, స్మృతీ బీసీసీఐకి లేఖ రాశారు.

ఆయన వచ్చాక జట్టు వైఖరిలో మార్పు వచ్చిందని, వచ్చే టీ20 ప్రపంచకప్‌కు కొద్ది సమయమే ఉండటం, కొత్త కోచ్ మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాలని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. స్వల్పకాలంలోనే క్రికెటర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సాంకేతికంగా, వ్యూహాత్మకంగా పొవార్ విజయం సాధించారని పేర్కొన్నారు.  అయితే సెమీస్‌లో మిథాలీ రాజ్‌పై వేటు వేయడంతో క్రీడాభిమానులతో పాటు భారత మాజీ క్రికెటర్లు రమేశ్ పొవార్‌పై మండిపడ్డారు. 

మిథాలీ ఎఫెక్ట్: రమేశ్ పొవార్‌పై వేటు..?

ఆసీస్ తో ఢీ: భారత్ కు షాక్, పృథ్వీషాకు మోకాలి గాయం

నాకిది చీకటి రోజు, దేశభక్తిని శంకించారు: మిథాలీ రాజ్

మిథాలీపై వేటు.. ధోనీ, కోహ్లీలను ఇలా చేసే దమ్ముందా..?

చెత్త స్ట్రైక్ రేట్: మిథాలీపై రమేష్ పొవార్ తీవ్ర వ్యాఖ్యలు

మిథాలీ పై వేటు.. స్పందించిన ఫరూఖ్ ఇంజినీర్

అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ

మిథాలీని ఎందుకు తప్పించావ్... హర్మన్ ప్రీత్‌పై బీసీసీఐ ఆగ్రహం

హర్మన్ ప్రీత్ కౌర్ పై మిథాలి రాజ్ మేనేజర్ సంచలన కామెంట్స్

click me!