కోచ్‌గా పొవారే కావాలి: బీసీసీఐకి తేల్చి చెప్పిన హార్మన్

By sivanagaprasad kodatiFirst Published Dec 4, 2018, 1:45 PM IST
Highlights

ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను సెమీస్‌లో పక్కనబెట్టడంపై కోచ్ రమేశ్ పొవార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రమేశ్ తనను ఎన్నోసార్లు అవమానించాడంటూ స్వయంగా మిథాలీ బీసీసీఐకి ఈమెయిల్ చేసింది.

ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను సెమీస్‌లో పక్కనబెట్టడంపై కోచ్ రమేశ్ పొవార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రమేశ్ తనను ఎన్నోసార్లు అవమానించాడంటూ స్వయంగా మిథాలీ బీసీసీఐకి ఈమెయిల్ చేసింది.

ఈ క్రమంలో అతని పదవికాలం ముగియడంతో పొవార్‌ శకం ముగిసినట్లేనని అందరూ భావించారు. అందుకు తగ్గట్టుగా బోర్డు కూడా కొత్త దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే తమకు పొవారే కోచ్‌గా ఉండాలంటూ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైఎస్ కెప్టెన్ స్మృతి మంథాన బీసీసీఐకి తెలిపారు.

ఈ మేరకు వారిద్దరూ బోర్డుకు లేఖ రాసినట్లు సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ కూడా ధ్రువీకరించారు. ‘‘ వరల్డ్‌కప్ సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో చేతుల్లో ఎదురైన ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా జట్టు ప్రతిష్టను దెబ్బతీశాయి.

తర్వాతి టీ20 ప్రపంచకప్‌కు ఇంకో 15 నెలల సమయమే ఉంది... న్యూజిలాండ్ పర్యటన మరో నెల రోజుల్లో మొదలవుతుంది. ఇలాంటి సమయంలో కోచ్‌ను మారిస్తే అది జట్టుపై ప్రభావం చూపుతుంది. కొత్త కోచ్ సున్నా నుంచి మొదలుపెట్టాలి..

కాబట్టి రమేశ్ పొవార్‌నే కోచ్‌గా కొనసాగించాలని... అతను జట్టును అద్బుతంగా తీర్చి దిద్దారని.. అతడి స్థానంలో మరొకరిని తేవాల్సిన అవసరమే లేదని హర్మన్ ప్రీత్ అభిప్రాయపడ్డారు. పొవార్ వచ్చాక భారత మహిళల జట్టు ముఖ చిత్రమే మారిపోయిందని... వరుస విజయాలు సాధించాం..

మిథాలీపై వేటుకు పొవార్ ఒక్కరే కారణం కాదని.. చాలా అంశాలు అందుకు కారణమయ్యాయని, ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే మిథాలీని తప్పించాం. కారణం ఏదైనప్పటికీ మిథాలీ, రమేశ్‌ల మధ్య విభేదాలను సర్దుబాటు చేయాలని హర్మన్, స్మృతి లేఖలో పేర్కొన్నారు. కాగా, వీరిద్దరి నిర్ణయాన్ని మిథాలీ రాజ్, ఏక్తా బిష్ట్, మాన్షి జోషి వ్యతిరేకించినట్లుగా సమాచారం. 

మిథాలీ ఎఫెక్ట్: రమేశ్ పొవార్‌పై వేటు..?

ఆసీస్ తో ఢీ: భారత్ కు షాక్, పృథ్వీషాకు మోకాలి గాయం

నాకిది చీకటి రోజు, దేశభక్తిని శంకించారు: మిథాలీ రాజ్

మిథాలీపై వేటు.. ధోనీ, కోహ్లీలను ఇలా చేసే దమ్ముందా..?

చెత్త స్ట్రైక్ రేట్: మిథాలీపై రమేష్ పొవార్ తీవ్ర వ్యాఖ్యలు

మిథాలీ పై వేటు.. స్పందించిన ఫరూఖ్ ఇంజినీర్

అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ

మిథాలీని ఎందుకు తప్పించావ్... హర్మన్ ప్రీత్‌పై బీసీసీఐ ఆగ్రహం

హర్మన్ ప్రీత్ కౌర్ పై మిథాలి రాజ్ మేనేజర్ సంచలన కామెంట్స్

click me!