మా క్రికెటర్లకు సిగ్గు లేదు: వెస్టిండీస్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

By sivanagaprasad kodatiFirst Published Nov 6, 2018, 1:29 PM IST
Highlights

భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లకు వెస్టిండీస్ క్రికెటర్లు గైర్హాజరవ్వడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ కార్ల్ హూపర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుతో తలపడేందుకు వెళ్లేటప్పుడు అనుభవజ్ఞులైన క్రికెటర్లు లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటన్నాడు

భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లకు వెస్టిండీస్ క్రికెటర్లు గైర్హాజరవ్వడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ కార్ల్ హూపర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుతో తలపడేందుకు వెళ్లేటప్పుడు అనుభవజ్ఞులైన క్రికెటర్లు లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటన్నాడు.

చాలామందికి జాతీయ జట్టు తరపున ఆడాలనే ఉద్దేశ్యం లేకపోవడంతోనే వారు ఏదో ఒక సాకు చెబుతున్నారని హూపర్ విమర్శించాడు. సీనియర్ ఆటగాళ్లు జట్టులో లేకపోవడంతో టీ20ల్లో వెస్టిండీస్‌ని ఓడించడం టీమిండియాకు సులువుగా మారిందన్నారు..

ప్రస్తుత ఆటగాళ్లు అంతా కుర్రాళ్లు.. వారిలో ప్రతిభ ఉంది కానీ.. అనుభవం తక్కువ.. వారు రాటుదేలేందుకు సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. గత కొన్నేళ్లుగా విండీస్ క్రికెట్ బోర్డు, సీనియర్ క్రికెటర్ల మధ్య వేతనాల విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి.

దీంతో వారు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. సీనియర్ల వైఖరిపై అభ్యంతరం తెలిపిన కార్ల్ హూపర్ పై విధంగా స్పందించాడు. 

కోహ్లీ పార్టీ ఇవ్వలేదని అలిగి ట్రైన్ ఎక్కిన రవిశాస్త్రి.. నెట్టింట మీమ్స్

అజారుద్దీన్ పై గంభీర్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు

కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ వరల్డ్ నెంబర్ వన్.....

అమెరికా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా భారతీయ యువకుడు...

''ధోనీ దరిదాపుల్లోకి కూడా వారు రాలేరు...వారి కోసం తప్పించారా?''

టీ20ల్లో పాక్ సంచలన రికార్డ్

రిషబ్ పంత్ కోసమే.. ధోనీ అలా చేశాడు.. కోహ్లీ

కేరళ అభిమానులకు ధోనీ ఫీవర్....ఐదో వన్డే సందర్భంగా భారీ కటౌట్ (వీడియో)

click me!