అమెరికా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా భారతీయ యువకుడు...

By Arun Kumar PFirst Published Nov 5, 2018, 5:08 PM IST
Highlights

అతడికి క్రికెట్ అంటే ఎంతో ప్రాణం. ఆ ఇష్టంతోనే ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరో వైపు క్రికెటర్ గా ఎదిగాడు. అయితే క్రికెట్లో రాణిస్తున్నప్పటికి అతడిలో ఏదో అనుమానం. క్రికెటర్
గా భారత జట్టులో స్థానం సంపాదించగలనా అని. దీంతో క్రికెట్ కెరీర్‌ను వదిలేసి చదువుపై దృష్టి పెట్టాడు. ఉద్యోగంలో చేరాడు. అయినా క్రికెట్ పై వున్న ప్రేమ మాత్రం తగ్గలేదు. దీంతో దేశం కాని దేశంలో మళ్లీ క్రికెటర్ అవతారం ఎత్తాడు. ఇంకేముంది బౌలర్ గా తన అత్యుత్తమ ప్రతిభను బైటపెట్టి అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్ గా మారాడు. అతడే  ముంబై వాసి సౌరబ్ నేత్రవల్కర్. 

అతడికి క్రికెట్ అంటే ఎంతో ప్రాణం. ఆ ఇష్టంతోనే ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరో వైపు క్రికెటర్ గా ఎదిగాడు. అయితే క్రికెట్లో రాణిస్తున్నప్పటికి అతడిలో ఏదో అనుమానం. క్రికెటర్‌గా భారత జట్టులో స్థానం సంపాదించగలనా అని. దీంతో క్రికెట్ కెరీర్‌ను వదిలేసి చదువుపై దృష్టి పెట్టాడు. ఉద్యోగంలో చేరాడు. అయినా క్రికెట్ పై వున్న ప్రేమ మాత్రం తగ్గలేదు. దీంతో దేశం కాని దేశంలో మళ్లీ క్రికెటర్ అవతారం ఎత్తాడు. ఇంకేముంది బౌలర్ గా తన అత్యుత్తమ ప్రతిభను బైటపెట్టి అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్ గా మారాడు. అతడే  ముంబై వాసి సౌరబ్ నేత్రవల్కర్. 

సౌరబ్ నేత్రవల్కర్‌ది మహారాష్ట్ర రాజధాని ముంబై. ఇండియాలోని చాలామంది యువకుల మాదిరిగానే  అతడు కూడా క్రికెట్ ను తన కెరీర్ గా ఎంచుకున్నాడు. ఇలా క్రికెటర్ గా అంచలంచెలుగా ఎదుగుతూ తన బౌలింగ్ తో ప్రత్యర్థులను ఆటకట్టించి బిసిసిఐ అధికారుల దృష్టిలో పడ్డాడు. ఇలా 2010  అండర్ 19 ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. ఆ తర్వాత మూడేళ్లకు మహారాష్ర్ట జట్టు తరపున రంజీ  మ్యాచ్ లో ఆరంగేట్రం చేశాడు. రంజీల్లోను తనదైన బౌలింగ్ తో ప్రత్యర్థులపై పైచేయి సాధించాడు.

అయితే అంతర్జాతీయ జట్టులో స్థానం కోసం పోటీని చూసి అతడిలో అనుమానం మొదలయ్యింది. ఈ అనుమానమే సౌరవ్ ను ఇండియన్ క్రికెట్ కు దూరం చేసింది. క్రికెట్ కెరీర్ ను వదులుకుని ఉన్నతచదువు కోసం అతడు అమెరికా వెళ్లాడు. అక్కడ మాస్టర్స్ చేసి ఒరాకిల్ కంపనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే ఆ ఉద్యోగ జివీతం అతడికి సంతృప్తినివ్వలేదు. దీంతో ఉద్యగోం చేస్తూనే తనకిష్టమైన క్రికెట్ లోకి పునరాగమనం చేశాడు.

అయితే అతడి ప్రతిభకు అమెరికాలోనూ మంచి గుర్తింపు లభించింది. దీంతో గత ఏడాది జనవరిలో యూఎస్ జట్టులో స్థానం సంపాదించాడు. ఇలా యూఎస్ జట్టులో కూడా తన మీడియం పేస్ బౌలింగ్ తో అద్భుతాలు సృషిస్తూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇంకేముంది యూఎస్ క్రికెట్ జట్టుకు ఈ 27 ఏళ్ల భారత ఆటగాడు కెప్టెన్ గా మారాడు. త్వరలో జరగనున్న ప్రపంచకప్ అర్హత మ్యాచ్ కు యూఎస్ జట్టు సౌరవ్ సారథ్యంలోనే బరిలోకి దిగనుంది. 

 

click me!