కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ వరల్డ్ నెంబర్ వన్.....

By Arun Kumar PFirst Published Nov 5, 2018, 7:17 PM IST
Highlights

భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత అంత దాటిగా బ్యాటింగ్ చేసే బ్యాట్ మెన్ ఎవరైనా ఉన్నారంటే అతడు రోహిత్ శర్మనే. అందువల్లే అభిమానులు కూడా ఆయన్ని రోహిట్ శర్మ అని పిలుచుకుంటుంటారు. అయితే ఇలా తన ధనాధన్ బ్యాటింగ్ తో రోహిత్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే కెప్టెన్ గా కూడా ఆయన ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. 

వెస్టిండిస్ తో ఆదివారం ప్రారంభమైన టీ20 సీరిస్ కు రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ టీంఇండియాకు సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ లో విండీస్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  దీంతో రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించిన పది టీ20 మ్యాచుల్లో భారత్ తొమ్మిది విజయాలు సాధించింది. 

ఈ విధంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి వరుసగా 10 మ్యాచుల్లో 8 విజయాలు సాధించిన రికార్డు మైకేల్‌ క్లార్క్‌, షోయబ్ మాలిక్,అస్కార్‌ అప్ఘాన్‌, సర్పరాజ్‌ అహ్మద్‌ ల పేరిట ఉంది. అయితే పదింట తొమ్మిది విజయాలు సాధించిన కెప్టెన్ గా రోహిత్ వారిని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు నెలకొల్పాడు. దీంతో టీంఇండియాకు రెగ్యులర్ కెప్టెన్ కాకపోయినా రోహిత్ అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు.    

మరిన్ని వార్తలు 

టీ 20: భయపెట్టిన విండీస్ బౌలర్లు, కష్టపడి గెలిచిన ఇండియా

 వన్డేల్లో 21ఏళ్లు....కానీ టీ20 లో నాలుగేళ్లే...విండీస్‌పై భారత్‌ రికార్డు

click me!