క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్రమాదం

By telugu teamFirst Published Aug 24, 2019, 11:49 AM IST
Highlights

ప్రమాదం సంభవించిన సమయంలో శ్రీశాంత్ భార్య, కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని క్రికెటర్ మీడియాకి వివరించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేరళలోని కొచ్చిలోని శ్రీశాంత్ ఇంట్లో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వారి ఇంట్లోని ఓ గది పూర్తిగా కాలి బూడిదయ్యింది. కాగా... ఎలాంటి ప్రాణ నష్టం సంభవించించలేదు. 

ప్రమాదం సంభవించిన సమయంలో శ్రీశాంత్ భార్య, కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని క్రికెటర్ మీడియాకి వివరించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా..కొద్దిరోజుల క్రితమే శ్రీశాంత్ పై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ తగ్గించింది. జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదించింది. ఇప్పటికే 6 సంవత్సరాలపాటు శ్రీశాంత్ శిక్షాకాలన్నిగడిపారు. కాగా...వచ్చే ఏడాది ఆగస్టు నాటికి  అతని నిషేధం పూర్తి కానుంది. 2013లో ఐపీఎల్ లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ లకు పాల్పడ్డారనే ఆరోపణలతో అతనిపై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. 

click me!