కరోనా వైరస్: క్వారంటైన్ పాటించకుండా రాష్ట్రపతిని కలిసిన మేరీ కోమ్

By Sree sFirst Published Mar 22, 2020, 4:19 PM IST
Highlights

తాజాగా భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ విదేశాల నుంచి వచ్చిన తరువాత క్వారంటైన్ పాటించకుండా ఏకంగా రాష్ట్రపతి భవన్ లోకే వెళ్ళింది. వెళ్లి అక్కడ ఎంపీలతోపాటుగా రాష్ట్రపతిని కూడా కలిసింది. 

ప్రపంచంలో కరోనా వైరస్ దెబ్బకు జనాలు ఎవర్ని కలవాలన్నా వణికిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండమని కోరుతోంది. 

తాజాగా భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ విదేశాల నుంచి వచ్చిన తరువాత క్వారంటైన్ పాటించకుండా ఏకంగా రాష్ట్రపతి భవన్ లోకే వెళ్ళింది. వెళ్లి అక్కడ ఎంపీలతోపాటుగా రాష్ట్రపతిని కూడా కలిసింది. 

నిన్నమొన్నటి వరకు కేవలం దుశ్యంత్ సింగ్ ఒక్కడే ఇలా వెళ్ళాడు అని అనుకుంటుంటే... ఇప్పుడు ఇలా మరో ఎంపీ వెళ్లడం, అందునా ఆమె భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించి, భారతీయులకు రోల్ మోడల్ అయిన ఒక క్రీడాకారిణి కావడం వల్ల సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. 

Also Read: యూకే ప్రయాణం దాచి, పార్టీలో కేరింతలు: కనికాపై యూపీ సర్కార్ సీరియస్

దుశ్యంత్ సింగ్ అయినా తెలియకుండా కనికా కపూర్ పార్టీకి వెళ్ళాడు. కనికా ట్రావెల్ హిస్టరీ దాచిపెట్టడం వల్ల అతను ఆ పార్టీకి వెళ్ళాడు. మేరీ కోమ్ మాత్రం ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ... ఇలా రాష్ట్రపతి భావం లోకి వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశమైంది, వివాదాస్పదమైంది. 

ఇటీవల జోర్డాన్‌లో జరిగిన ఆసియా పసిఫిక్‌ బాక్సింగ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ టోర్నీలో పాల్గొన్న మేరీకోమ్‌ మార్చి 13న స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ నెల 18న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లో ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌కు చెందిన పార్లమెంట్‌ సభ్యులకు అల్పాహార విందు ఇచ్చారు. 

ఈ అల్పాహార విందుకు రాజ్యసభ సభ్యురాలు మేరీకోమ్‌ హాజరైంది. గాయని కణికా కపూర్‌తో కరచాలనం చేసిన ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ సైతం అల్పాహార విందుకు హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్‌ ట్విటర్‌లో ఉంచిన ఫోటోలలో మేరీకోమ్‌, దుష్యంత్‌ సింగ్‌లు ఉన్నారు. 

Also Read: కనికా కపూర్‌కు కరోనా : ఆ ప్రముఖులకు వెన్నులో వణుకు.. హోమ్ క్వారంటైన్‌లో వసుంధర రాజే

అయితే... మేరీ కోమ్ తొలుత 10 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉన్నట్టు ఆమె కోచ్ అంటున్నారు. ఏది ఏమైనా మేరీ కోమ్ ఇలా 14 రోజుల స్వీయ నిర్బంధాన్ని పాటించలేదని విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

click me!