ప్రపంచానికి తెలియని ద్రవిడ్ రికార్డును ప్రకటించిన బీసీసీఐ

By sivanagaprasad kodatiFirst Published Nov 20, 2018, 1:54 PM IST
Highlights

ఏ ఫార్మాట్‌లోనైనా ఒకేలా ఆడగలడు అని నిరూపించాడు రాహుల్ ద్రావిడ్. అతని టెక్నిక్‌ ద్రావిడ్‌ను అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిపింది. అంతటి దిగ్గజానికి చెందిన ఓ అరుదైన రికార్డుని బీసీసీఐ సోమవారం ట్వీట్ చేసింది. 

భారత క్రికెట్‌లో మిస్టర్ డిపెండబుల్‌గా, ది వాల్‌గా, ఆపద్భాంధవుడిలా పేరు తెచ్చుకున్న వ్యక్తి రాహుల్ ద్రావిడ్. టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ పదివేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్,  వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా జట్టుకు సేవలు అందించిన క్రికెటర్.

ఏ ఫార్మాట్‌లోనైనా ఒకేలా ఆడగలడు అని నిరూపించాడు రాహుల్ ద్రావిడ్. అతని టెక్నిక్‌ ద్రావిడ్‌ను అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిపింది. అంతటి దిగ్గజానికి చెందిన ఓ అరుదైన రికార్డుని బీసీసీఐ సోమవారం ట్వీట్ చేసింది.

క్రికెటర్‌గా రిటైర్ అయిన ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రికార్డు ఏంటీ అనుకుంటున్నారా..? టెస్టుల్లో 30 వేలకు పైగా బంతులు ఎదుర్కొన్న ఏకైక బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్. క్రికెట్ కెరీర్‌లో మొత్తం 31258 బంతులను ఎదుర్కొన్నాడు.

ఆఖరికి క్రికెట్ గాడ్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌‌కు కూడా ఈ రికార్డు బద్ధలు కొట్టలేకపోయాడు. 24 సుధీర్ఘ క్రికెట్‌లో సచిన్ ఆడిన బంతులు 29,437. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే సమయానికి 52.31 సగటుతో ద్రవిడ్ 13,288 పరుగులు చేశాడు. ఆధునిక క్రికెట్‌లో ద్రవిడ్ నమోదు చేసిన యావరేజ్ అత్యుత్తమ సగటుగా నిలిచింది. 

 

ధోనీ 20ఏళ్ల కుర్రాడు అనుకున్నారా.. కపిల్ దేవ్ కామెంట్స్

‘‘కశ్మీర్ పాకిస్తాన్‌‌దే’’...మాట మార్చిన అఫ్రిది

రోహిత్‌,కోహ్లీలను వెనక్కినెట్టిన మిథాలీ...ఇప్పుడు గప్టిల్ ను కూడా...

లిటిల్ మాస్టర్‌‌కు ఈ రోజు మెమొరబుల్ డే..ఎందుకంటే..
భారతీయ క్రీడాకారుడి ఆత్మహత్య....అకాడమీ హాస్టల్లోనే ఉరేసుకుని

ఆసిస్ బౌలర్ కి అరుదైన జబ్బు.. ఆటకు గుడ్ బై

కోహ్లీలో నిగ్రహం లేదు.. నోరు జారుతున్నాడు: విశ్వనాథన్ ఆనంద్

కోహ్లీ కుర్రాడు...అందువల్లే ఆ దూకుడు: బాలీవుడ్ డైరెక్టర్ సపోర్ట్

వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కోహ్లీ...ఎందుకలా అన్నానంటే...

 

Rahul Dravid is the only cricketer till date to have faced more than 30,000 (31,258) deliveries in Test cricket 😯😯 pic.twitter.com/HDO1uJLi3z

— BCCI (@BCCI)
click me!
Last Updated Nov 20, 2018, 1:54 PM IST
click me!