రోహిత్‌,కోహ్లీలను వెనక్కినెట్టిన మిథాలీ...ఇప్పుడు గప్టిల్ ను కూడా...

By Arun Kumar PFirst Published Nov 16, 2018, 3:57 PM IST
Highlights

ఐసిసి టీ20 ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు అదరగొడుతోంది.  మొన్న ఆస్ట్రేలియాపై హర్మన్‌ అదిరిపోయే సెంచరీ సాధించగా...ఐర్లాండ్ లో మ్యాచ్ లో మిథాలీ రాజ్ అద్బుత బ్యాటింగ్ తో భారత్ కు విజయం అందించారు. ఈ మ్యాచ్ లో 51 పరుగులు సాధించిన మిథాలీ తన కెరీర్ లో 17 వ అర్థశతకాన్ని పూర్తిచేసుకుంది. ఈ పరుగుల ద్వారా ఆమె అంతర్జాతీయ మహిళల క్రికెట్ విభాగంలోనే కాదు పురుషుల విభాగంలోని దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను బద్దలుగొట్టింది. 

ప్రస్తుతం పురుషుల అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(2207) మొదటిస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే మిథాలీ ఇదివరకే పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా  బ్యాటింగ్ చేసి వీరి రికార్డులను బద్దలుగొట్టిన విషయం తెలిసిందే. మొత్తంగా టీ20ల్లో (2232) అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచింది.

ఇక మిథాలీ నిన్న(శుక్రవారం) ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మరో అర్ధశతకం(51) పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ బ్యాట్ మెన్ మార్టిన్‌ గఫ్తిల్‌ 2271 పరుగులతో వరల్డ్ నెంబర్ వన్ గా ఉన్నాడు. అయితే మిథాలీ 37.43 సగటుతో ఇప్పటివరకు 2,283 పరుగులు సాధించి అతన్ని వెనక్కి నెట్టింది.    

మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ ఐదో స్థానంలో ఉన్నారు.. ఆమె కంటే ముందు న్యూజిలాండ్‌ బ్యాట్స్‌వుమెన్‌ సుజీ బేట్స్‌(2913) అగ్రస్థానంలో ఉండగా, విండీస్‌ బ్యాటర్‌ టేలర్‌(2691), ఇంగ్లాండ్‌కు చెందిన ఎడ్వర్డ్స్‌(2605), ఆస్ట్రేలియా క్రికెటర్ లానింగ్‌(2241) ఉన్నారు.

click me!
Last Updated Nov 16, 2018, 4:02 PM IST
click me!