‘‘కశ్మీర్ పాకిస్తాన్‌‌దే’’...మాట మార్చిన అఫ్రిది

By sivanagaprasad kodatiFirst Published Nov 17, 2018, 10:59 AM IST
Highlights

కొద్దిరోజులక్రిత పాకిస్తాన్‌కు కశ్మీర్ అవసరం లేదని వ్యాఖ్యానించిన పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మాట మార్చాడు. కశ్మీర్ ఎప్పటికీ పాకిస్తాన్‌దే నంటూ ట్వీట్ చేశాడు.

కొద్దిరోజులక్రిత పాకిస్తాన్‌కు కశ్మీర్ అవసరం లేదని వ్యాఖ్యానించిన పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మాట మార్చాడు. కశ్మీర్ ఎప్పటికీ పాకిస్తాన్‌దే నంటూ ట్వీట్ చేశాడు. కొద్దిరోజుల క్రితం ‘‘పాకిస్తాన్‌కు కశ్మీర్ అవసరం లేదు.. దానిని భారత్‌కు ఇవ్వొద్దు.. కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలి.. ఉన్న నాలుగు రాష్ట్రాలనే పాక్ పరిపాలించలేకపోతోంది’’ అని రెండు రోజుల ముందు అఫ్రిది విద్యార్ధులతో ముఖాముఖి సందర్భంగా అన్నాడు.

దీనిపై స్వదేశంలో మీడియా, ప్రజలు, నేతల నుంచి విమర్శలు రావడంతో అఫ్రిది నష్టనివారణ చర్యలు చేపట్టాడు. ‘‘ భారతీయ మీడియా నా వ్యాఖ్యలను వక్రీకరించింది.. నా దేశంపై తనకు ఎంతో అభిమానం ఉంది.. కశ్మీరీల పోరాటంపై విలువుంది... మానత్వం వర్ధిల్లాలి అని ట్వీట్ చేశాడు.

 ఆ తర్వాత కొద్దిసేపటికి ‘‘కశ్మీర్ వివాదం ఇంకా పరిష్కారం కాలేదు.. అది భారతదేశ దురాక్రమణలో ఉంది...ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం సమస్య పరిష్కారం కావాలి.. నాతో పాటు ప్రతి పాక్ పౌరుడు కశ్మీర్ స్వాతంత్ర్యానికి మద్ధతిస్తాడు.. కశ్మీర్ పాక్‌దేనని వీడియోలో తెలిపాడు.

అఫ్రిది వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ స్పందించాడు.. రాజకీయాలు, సున్నిత అంశాలకు క్రికెటర్లు దూరంగా ఉండాలని సూచించాడు.. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే వరకు ఆటపైనే దృష్టి కేంద్రీకరించాలని మియాందాద్ అన్నాడు.

కశ్మీర్‌పై అఫ్రిది వ్యాఖ్యలు... స్పందించిన శివసేన

కాశ్మీర్‌పై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న పాకిస్థానీ మాజీ క్రికెటర్ అఫ్రిది

click me!