క్రికెటర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు... తప్పులో కాలేసిన ఐసీసీ

By telugu teamFirst Published Aug 1, 2019, 11:02 AM IST
Highlights

ఓ క్రికెటర్ ఫోటో పెట్టి మరో క్రికెటర్ కి బర్త్ డే విషెస్ చెప్పింది. ఆ తప్పుని అభిమానులు కనిపెట్టడంతో.. వెంటనే ఐసీసీ తన ట్వీట్ ని డిలీట్ చేసింది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పప్పులో కాలేసింది.సాధారణంగా... క్రికెటర్ల పుట్టినరోజు సమయంలో వారికి ట్విట్టర్ వేదికగా ఐసీసీ శుభాకాంక్షలు చెబుతుంది. అలానే శుభాకాంక్షలు చెప్పబోయి... ఓ క్రికెటర్ విషయంలో మాత్రం పెద్ద మిస్టేక్ చేసింది ఐసీసీ. 

ఇంతకీ మ్యాటరేంటంటే... ఓ క్రికెటర్ ఫోటో పెట్టి మరో క్రికెటర్ కి బర్త్ డే విషెస్ చెప్పింది. ఆ తప్పుని అభిమానులు కనిపెట్టడంతో.. వెంటనే ఐసీసీ తన ట్వీట్ ని డిలీట్ చేసింది.

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఆండ్రూహాల్ బుధవారం 44వ పుట్టినరోజు జరుపుకున్నాడు. కాగా... అతనికి విషెస్ చెబుతూ ఐసీసీ ట్వీట్ చేసింది. అయితే... అందులో ఆండ్రూహాల్ కు బదులుగా మరోక సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ చార్ల్ లాంగ్ వెల్ట్ ఫోటోను పెట్టింది. 

అదేవిధంగా అటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీ చేసిన ట్వీట్ కు రిప్లై ఇచ్చింది. చార్ల్ లాంగ్ వెల్ట్ సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ అని, అతను తమ జట్టుకు బౌలింగ్ కోచ్ అని చెబుతూ బంగ్లా క్రికెట్ బోర్డు.. ఆండ్రూ హాల్ ఫోటో పెట్టి ట్వీట్ చేసింది. ఐసీసీ చేసిన తప్పు తేలడంతో... అందరూ ట్రోల్ చేయడం విశేషం. 

click me!