భళా సింధు భళా... సింగపూర్ ఓపెన్ 2022 ఫైనల్స్‌కి దూసుకెళ్లిన పీవీ సింధు...

By Chinthakindhi Ramu  |  First Published Jul 16, 2022, 11:41 AM IST

సింగపూర్ ఓపెన్ 2022 సెమీ ఫైనల్‌లో సైనా కవాకామిని చిత్తు చేసిన పీవీ సింధు... కేవలం 31 నిమిషాల్లోనే ముగిసిన సెమీ ఫైనల్స్...


భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధు... సింగపూర్ ఓపెన్ 2022 టోర్నీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. జపాన్‌ బ్యాడ్మింటన్ ప్లేయర్, వరల్డ్ నెం. 43 ర్యాంకర్ సైనా కవాకామితో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 21-15, 21-7 తేడాతో సునాయాస విజయం అందుకుంది పీవీ సింధు...

భారత బ్యాడ్మింటన్ స్టార్ జోరు ముందు నిలవలేకపోయిన కవాకామి, కేవలం 31 నిమిషాల్లోనే చేతులు ఎత్తేసింది. పీవీ సింధు, సింగపూర్ ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి... 

Latest Videos

undefined

మరో సెమీ ఫైనల్‌లో జపాన్ ప్లేయర్ ఆయా ఓహోరీ, చైనా ప్లేయర్ జీ యి వాంగ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్‌తో ఫైనల్‌ ఆడబోతోంది పీవీ సింధు.. 2022లో పీవీ సింధుకి ఇది మూడో ఫైనల్ మ్యాచ్. ఇంతకుముందు ఈ ఏడాది ఫైనల్ చేరిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ, స్విస్ ఓపెన్ 2022 టోర్నీల్లో విజేతగా నిలిచింది పీవీ సింధు.. 

అంతకుముందు చైనా ప్లేయర్ హాన్ యూతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 17-21, 21-11, 21-19 తేడాతో పోరాటం గెలిచింది పీవీ సింధు. సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిస్తే, సైనా నెహ్వాల్ తర్వాత ఈ టోర్నీ గెలిచిన భారత బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ ప్లేయర్‌గా నిలుస్తుంది పీవీ సింధు.. ఇంతకుముందు 2010లో భారత సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచింది...

FINALS FOR SINDHU 🔥👑 puts up exemplary performance to comfortably beat 🇯🇵's S Kawakami 21-15, 21-7 in just 31 minutes and cruise through to the summit clash of ✅

Go for 🥇 champ! pic.twitter.com/douunXYItC

— BAI Media (@BAI_Media)

ఈ సారి సింగపూర్ ఓపెన్ 2022 టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగు పెట్టిన సైనా నెహ్వాల్, సెమీస్ చేరలేకపోయింది. జపాన్ ప్లేయర్ల ఆయా ఓహోరితో జరిగిన మ్యాచ్‌లో 13-21, 21-15, 20-22 తేడాతో పోరాడి ఓడిన సైనా నెహ్వాల్, క్వార్టర్ ఫైనల్ నుంచి నిష్కమించింది... అలాగే 

భారత పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్, జపాన్‌కి చెందిన కొడై నరోకాతో జరిగిన మ్యాచ్‌లో 21-12, 14-21, 18-21 తేడాతో పోరాడి ఓడాడు. అలాగే రెండో రౌండ్‌కి వెళ్లిన భారత డబుల్స్ పురుషుల జోడి అర్జున్, ధృవ్ కపిల్... ఇండోనేషియా డబుల్స్ జోడితో జరిగిన మ్యాచ్‌లో 21-10, 18-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యారు...

మొదటి సెట్‌లో ఇండోనేషియా జోడిపై తిరుగులేని ఆధిపత్యం చూపించిన భారత బ్యాడ్మింటన్ జోడి, రెండు, మూడో సెట్లలో పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది... 

click me!