వంద కోట్లు ఇచ్చినా ఆ పనిచేయను... శశిథరూర్ ని ఓడిస్తా... క్రికెటర్ శ్రీశాంత్

By telugu teamFirst Published Sep 30, 2019, 8:31 AM IST
Highlights

ఫిక్సింగ్‌ ఆరోపణలపై మాట్లాడుతూ ‘నా పిల్లలు, తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెబుతున్నా. నేను స్పాట్‌ ఫిక్సింగ్‌కి పాల్పడలేదు. రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ అని అన్నాడు.

వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు బీజేపీ టికెట్లో దొరికితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేాయాలనే కోరికగా ఉందని  తన మనసులోని మాట బయటపెట్టారు. బీజేపీ తరఫున టిక్కెట్‌ లభిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ని ఓడిస్తానని శ్రీశాంత్ పేర్కొన్నారు.

‘వ్యక్తిగతంగా నేను శశిథరూర్‌ని అభిమానిస్తా. అయితే, ఎన్నికల విషయానికి వచ్చేసరికి శశిథరూర్‌ను ఓడిస్తాననడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు’ అని చెప్పాడు. బీజేపీ తరఫున 2016లో తిరువనంతపురం అసెంబ్లీ నుంచి శ్రీశాంత్‌ పోటీ చేసి 11 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం తెలిసిందే. ఇక, ఫిక్సింగ్‌ ఆరోపణలపై మాట్లాడుతూ ‘నా పిల్లలు, తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెబుతున్నా. నేను స్పాట్‌ ఫిక్సింగ్‌కి పాల్పడలేదు. రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ అని అన్నాడు.

ఇదిలా ఉండగా... గత నెలలో భారత పేసర్‌ శ్రీశాంత్‌పై ఉ‍న్న నిషేధాన్ని తగ్గిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై అతనిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇప్పటికే ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్‌.. వచ్చే ఏడాది ఆగస్టు నెలతో నిషేధాన్ని పూర్తి చేసుకోనున్నాడు.
 

click me!