కోహ్లీకి షాక్.. రోహిత్ కి పట్టం..?

By ramya NFirst Published Apr 8, 2019, 1:52 PM IST
Highlights

టీం ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ 2019లో ఆర్సీబీ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వరసగా ఆరు మ్యాచ్ లు ఓటమిపాలయ్యింది. 

టీం ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ 2019లో ఆర్సీబీ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వరసగా ఆరు మ్యాచ్ లు ఓటమిపాలయ్యింది. టీంలో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ ఓడిపోతోందంటే కారణం.. కేవలం కెప్టెన్సీ వైఫల్యమేననే అభిప్రాయం వెలువడుతోంది.

కాగా.. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఐపీఎల్ ప్రదర్శన ప్రభావం ప్రపంచ కప్ పై పడింది.  కోహ్లీ మంచి బ్యాట్స్ మెన్ అయినప్పటికీ... మంచి కెప్టెన్ మాత్రం అవ్వలేకపోతున్నాడంటూ అందరూ విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రభావం ప్రపంచకప్ మీద పడకుండా ఉండాలంటే.. టీం ఇండియాకి కెప్టెన్ మార్చాలంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కోహ్లీకి కాకుండా రోహిత్ కి కెప్టెన్సీ ఇస్తే.. టీం ఇండియా ప్రపంచకప్ లో నెగ్గుకువస్తుందని పలువురు భావిస్తున్నారు. రోహిత్‌శర్మ ముంబయి జట్టును మూడు సార్లు ఐపీఎల్‌ విజేతగా, ఒకసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలబెట్టాడు. భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా రోహిత్‌కు ఉంది అంటున్నారు.

మాజీ క్రికెట్‌ దిగ్గజం మైఖెల్‌ వాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో స్పందిస్తూ.. ‘భారత్‌ తెలివైన జట్టయితే ప్రపంచకప్‌లో సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీకి విశ్రాంతి కల్పించాలి’ అని పేర్కొన్నాడు. కొంతమంది అభిమానులు మాత్రం.. కోహ్లీ ఎప్పటికైనా ఉత్తమ కెప్టెన్‌గా రాణిస్తాడు అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటే బెంగళూరు జట్టు కూడా విజయాలు సాధిస్తుందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.

click me!