Ipl 2019  

(Search results - 292)
 • IPL 2020

  Cricket24, Jul 2020, 10:17 AM

  సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్, స్పెషల్ ఫ్లైట్స్ నడపనున్న యూఏఈ

  ఐపీఎల్‌13 యు.ఏ.ఈలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రాంఛైజీలు తమ ఏర్పాట్లలో ఉన్నాయి. ఐపీఎల్‌ కోసం బీసీసీఐ అధికారుల బృందం సైతం యుఏఈకి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో యుఏఈ ఎయిర్‌లైన్స్‌ సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థలు వెల్లడించాయి!. 

 • Cricket22, Jul 2020, 10:03 AM

  కుదించిన షెడ్యూల్, పెరిగిన డబుల్‌ హెడర్స్, ఐపీఎల్ లో మార్పులివే...

  2020 టీ20 వరల్డ్‌కప్‌ను ఐసీసీ అధికారికంగా వాయిదా వేయటంతో ఐపీఎల్‌ నిర్వహణకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి ప్రోటోకాల్‌ స్వేచ్ఛ లభించింది. ఐపీఎల్‌ షెడ్యూల్‌, వేదిక, లాజిస్టికల్‌ సహా ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ రానున్న పది రోజుల్లో సమావేశం కానుంది. 

 • আইপিএলের ছবি

  SPORTS20, Dec 2019, 1:13 PM

  ఏ జట్టులో ఏ ఆటగాడు.. కేకేఆర్‌ కెప్టెన్‌గా మళ్ళీఅతనే!


  ఐపీఎల్‌ వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది.  ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌  అధిక రేటుకు అమ్ముడుపోయి  అదరగొట్టాడు. తీవ్ర పోటీ నేపథ్యంలో అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏకంగా రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. మిగితా ఆటగాళ్ల కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.

 • CRICKET2, Oct 2019, 8:28 PM

  బెంగళూరు కాదు కోల్‌కతా... డిసెంబర్ 2019లో ఐపిఎల్ వేలం

  ఐపిఎల్ ఆటగాళ్ల వేలంపాట వేదిక మారిపోయింది. ప్రతిఏడాది ఈ కార్యక్రమం బెంగళూరులో జరుగుతుండగా ఈసారి కోల్‌కతాలో జరగనుంది. 

 • faf du plessis

  World Cup24, Jun 2019, 10:07 AM

  ఐపీఎల్ వల్లే ఓడాం.. అసలు ఆడకుండా ఉండాల్సింది: డూప్లెసిస్

  పాకిస్తాన్‌ చేతిలో ఘోర పరాజయంపై స్పందించాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్. ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఐపీఎలే తమ కొంపముంచిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

 • CRICKET20, May 2019, 4:53 PM

  స్మృతి మంధాన అంటే నాకెంతో ఇష్టం: యువ క్రికెటర్

  ఇటీవల ముగిసిన ఐపిఎల్ సీజన్ 12లో ఓ యువకుడు రాజస్థాన్ జట్టు తరపున అద్భుతంగా ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లు కూడా ఇంత చిన్న వయసులో అతడి పరిణతితో కూడిన బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ను మెచ్చుకోకుండా వుండలేకపోయారు. ఇలా కేవలం 17ఏళ్ల ప్రాయంలోనే ఐపిఎల్ లో అడుగుపెట్టిన రియాన్ పరాగ్ కేవలం తన ఆటతోనే కాదు మాటలతో కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. 

 • നിര്‍ണായകം ധോണി- റെയ്‌നയും റായുഡുവും വേഗം മടങ്ങിയതോടെ ധോണി ക്രീസിലെത്തി. എന്നാല്‍ ഇഷാന്‍ കിഷന്‍റെ ഉഗ്രന്‍ ത്രോ ധോണിയുടെ സ്റ്റംപ് തെറിപ്പിച്ചു. ഏറെനീണ്ട പരിശോധനകള്‍ക്കൊടുവിലാണ് ഈ ഔട്ട് മൂന്നാം അംപയര്‍ അനുവദിച്ചത്. ഇപ്പോഴും വിവാദങ്ങളും ബാക്കി.

  CRICKET19, May 2019, 5:28 PM

  ధోని రనౌట్‌పై గుక్కపట్టి ఏడ్చిన బాలుడు

   ఐపీఎల్ -12వ, సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రనౌట్‌ కావడంతో ఓ చిన్నారి గుక్కపట్టి ఏడ్చాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 • Rohit Ritika

  CRICKET18, May 2019, 1:42 PM

  వరల్డ్ కప్‌ ‌కు ముందు ప్రాక్టీస్ గాలికొదిలేసి... భార్యలతో భారత ఆటగాళ్ల షికార్లు

  ఇంగ్లాండ్ వేదికగా మరికొద్దిరోజుల్లో జరిగే ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ జట్లన్ని ప్రత్యేకంగా సిద్దమవుతున్నాయి.  ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా,  సౌతాఫ్రికా వంటి జట్లు ఐపిఎల్ మధ్యలో నుండే తమ ఆటగాళ్లను స్వదేశానికి రప్పించుకున్నారు. ప్రపంచ కప్ లో పాల్గొనే ఆటగాళ్లతో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ వారిని మెగా టోర్నీ కోసం సంసిద్దం చేస్తున్నాయి. ఇలా అన్ని జట్లు  ప్రాక్టీస్ లో మునిగితేలుతుంటే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న భారత జట్టు మాత్రం ఇప్పటివరకు ప్రాక్టీస్ ను ప్రారంభించలేదు. బిసిసిఐ ప్రత్యేకంగా ఆటగాళ్లను సంసిద్దం చేయడం మాట అటుంచితే వ్యక్తిగతంగా కూడా క్రికెటర్లు ప్రాక్టీస్ కు దూరంగా వుంటున్నారు. 

 • rohit

  CRICKET17, May 2019, 4:19 PM

  అటు ఐపిఎల్-ఇటు ప్రపంచ కప్...మధ్యలో మాల్దీవులు: కుటుంబంతో రోహిత్ సరదా

  ఐపిఎల్ 2019 ప్రారంభమైనప్పటి నుండి తీరిక లేకుండా గడిపిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ఈ ఐపిఎల్ ముగిసిన తర్వాత వెంటనే కాకుండా ప్రపంచ కప్ జరగనున్న ఇంగ్లాండ్ కు వెళ్లేందుకు టీమిండియా ఆటగాళ్లకు కాస్త సమయం దొరకింది. ఈ ఖాళీ సమయాన్ని కేవలం కుటుంబం కోసమే కేటాయించాలని రోహిత్ భావించినట్లున్నాడు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా భార్య రితికా సర్దేశాయ్, కూతురు సమైరాతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులు ప్లైటెక్కాడు. 

 • IPL 2019

  CRICKET16, May 2019, 8:59 PM

  కోహ్లీ కంటే ధోని, రోహిత్ కాదు...అయ్యర్ కూడా బెటరే: సంజయ్ మంజ్రేకర్

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసినా అభిమానులు ఇంకా ఆ లోకం నుండి  బయటకు రాలేకపోతున్నారు. కేవలం అభిమానులే కాదు మాజీలు, క్రికెట్ విశ్లేషకులు అంతెందుకు ఆటగాళ్ళు కూడా ఇంకా ఐపిఎల్ ఫీవర్ నుండి బయటకు రాలేదు. అందువల్లే తాజా ఐపిఎల్ పై రోజుకో విధమైన చర్చ జరుగుతోంది. తాజాగా ఐపిఎల్ లో గొప్ప కెప్టెన్ ఎవరన్నదానిపై ప్రధానంగా చర్చ మొదలయ్యింది. 

 • kohli gambhir

  CRICKET16, May 2019, 6:14 PM

  కోహ్లీ కంటే అతడి వారసుడే బెటర్: గౌతమ్ గంభీర్

  టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ మరోసారి విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి మాత్రం కోహ్లీపై విరుచుకుపడకుండా అండగా నిలిచే ప్రయత్నం చేశాడు. ఇటీవల  ఐపిఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును  ముందుడి నడిపించడంలో విఫలమైన కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే గంభీర్ ఓ వైపు కోహ్లీని సమర్థిస్తూనే మరో వైపు అతడి వైఫల్యాలను ఎత్తిచూపుతూ చురకలు అంటించాడు. 
   

 • Rohit Sharma-Shikhar Dhawan

  CRICKET16, May 2019, 5:20 PM

  రోహిత్ ఎంతో పృథ్విషా కూడా అంతే: ధావన్ సంచలనం

  ప్రపంచ కప్ మెగా టోర్నీకి ముందు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఓపెనింగ్ పాట్నర్ రోహిత్ శర్మ గురించి సంచలన వ్యాఖ్యలు  చేశాడు. అందరు అనుకుంటున్నట్లు తామిద్దరి మధ్య ఎలాంటి ప్రత్యేకమైన అనుబంధం లేదని  ధావన్ అన్నాడు. తాను రోహిత్ తో కలిసి ఎలా ఆడతానో... పృథ్విషా తో కలిసి కూడా అలాగే ఆడతానన్నాడు. జట్టు మేనేజ్ మెంట్ నిర్ణయిస్తే ఏ ఆటగాడితోనైనా ఓపెనర్ గా బరిలోకి దిగడానికి సిద్దమేనని ధావన్ పేర్కొన్నాడు. 

 • Sehwag

  CRICKET16, May 2019, 3:13 PM

  బిసిసిఐ త్రీ డైమెన్షన్ ప్లేయర్స్ కూడా అతడితో సరితూగలేరు: సెహ్వాగ్

  టీమిండియా చరిత్రలో హిట్టింగ్  అన్న పదాన్ని చేర్చిన ఆటగాడు వీరేంద్ర సేహ్వగ్. భారత జట్టు  తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి  మొదటి  బంతినుండి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేవాడు. అలాంటి ఈ మాజీ హిట్టర్ ని మరో ఆటగాడి బ్యాటింగ్ నచ్చిందంటే అతడెంత దూకుడుగా ఆడతాడో అర్థం చేసుకోవచ్చు. సెహ్వాగ్ చేత ప్రశంసలను అందుకున్న ఆటగాడు మరెవరో కాదు టీమిండియా, ముంబై  ఇండియన్స్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. 

 • dhoni run out

  CRICKET16, May 2019, 2:34 PM

  ధోని రనౌట్ వివాదం...న్యూజిలాండ్ ప్లేయర్ జిమ్మి నీషమ్ పై అభిమానుల ఫైర్

  ఐపిఎల్ సీజన్ 12 ముగిసి నాలుగు రోజులు కావస్తోంది. అయినా ఈ లీగ్  గురించి అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో ఇంకా చర్చలు  కొనసాగుతూనే వున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ ఫైనల్ పోరుపై మరీ ఎక్కువగా చర్చ జరుగుతోంది. మరీముఖ్యంగా కీలక సమయంలో ధోని రనౌట్ పై క్లారిటీ లేకున్నా అంపైర్లు తమ నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించడంపై చెన్నై అభిమానులు ఆగ్రహంతో వున్నారు. ఇదే చెన్నై గెలుపు అవకాశాలను దెబ్బతీసిందన్నది  వారి వాదన. అలాంటి సమయంలో న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నిషన్ ఈ రనౌట్ వివాదంలో తలదూర్చి అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. 

 • dhoni kohli kuldeep

  CRICKET15, May 2019, 9:19 PM

  ధోనిపై విమర్శల వివాదం...స్పందించిన కుల్దీప్ యాదవ్

  టీమిండియా మాజీ  కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పై బౌలర్ కుల్దీప్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ వార్త గత రెండు రోజులుగా ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రచారాన్ని కుల్దీప్ తాజాగా ఖండించాడు. తాను ధోనికి వ్యతిరేకంగా మాట్లాడలేనని...మీడియా, సోషల్ మీడియాలో నా మాటలను   వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నట్లు కుల్దీప్ తెలిపాడు.