డిసెంబర్ 2 న తెలంగాణా విద్యార్థులతో రాహుల్ సమావేశం

First Published Oct 21, 2016, 12:28 PM IST
Highlights
  • డిసెంబర్ 2 తెలంగాణా విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశం
  • తెలంగాణా  ఏర్పాటు లక్ష్యాలను వివరించనున్న రాహుల్
  • టిఆర్ ఎస్ కు వ్యతిరేకంగా విద్యార్థలను సమీకరణకు కాంగ్రెస్ క్యాంపెయిన్

ఇంతవరకు రైతుల సమస్యలకే పరిమితమయిన  తెలంగాణా కాంగ్రెస్ ఇపుడు  టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను కూడగట్టడం మొదలుపెట్టింది.  తెలంగాణా ఉద్యమంలో కీలకపాత్ర వహించిన విద్యార్థులతోనే  తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఆశయాలను ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఎలా వమ్ముచేస్తున్నారో ప్రచారం చేయించేందుకు పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహం పన్నారు.

 

తెలంగాణా  విద్యార్థుల ఉద్యమంలో ఒక రోజూ పాల్గొనేందుకు  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా  ఆహ్వానిస్తున్నారు. డిసెంబర్ 2 రాహుల్ గాంధీ  విద్యార్థుల  సమావేశంలో పాల్గొని , తెలంగాణా ప్రత్యేక రాష్ట్రానికి కాంగ్రెస్ ఎందుకు అంగీకరించిందో, టిఆర్ ఎస్ హయాంలో జరుగుతున్నదేమిటో వివరిస్తారు.

 

 తెలంగాణాలో ప్రభుత్వానికి అన్యాయం జరుగుతూ ఉందని ఈ రోజు ఎన్ఎస్ యుఐ అధ్యర్యంలో విద్యార్థుల సంతకాల సేకరణ క్యాంపెయిన జరిగింది.  ఈ సందర్భంగా  మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం పీజుల బకాయి చెల్లించకపోవడంవల్ల 3200 కాలేజీలు మూతపడ్డాయని,దీనికి 14 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమయిందని చెప్పారు.  కాలేజీల యాజమాన్యాలు తనకు ఈ కాలేజీల గురించి వినతి పత్రం సమర్పించాయని అయన చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థుల బాధలు కేసీఆర్ కు కనిపించడం లేదా..? సర్కార్ మెడలు వంచేందుకే పీజు  దరఖాస్తుల ఉద్యమాం చేపట్టామని ఆయన చెప్పారు.

 

డిసెంబర్ 2న రాహుల్ దరఖాస్తు ఉద్యమంలో పాల్గొంటారని,  రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు  అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి కుంతియా,  ఎస్ సి సెల్ ఛెయిర్మన్ కొప్పుల రాజు,  సీనియర్ పార్టీ నాయకులు డికె అరుణ, వంశీ చంద్ రెడ్డి, మ ల్లు రవి, తదితరులు పాల్గొన్నారు.

 

click me!