ఇదీ బిజెపి తెలంగాణా కల

First Published Oct 22, 2016, 11:35 AM IST
Highlights
  • తెలంగాణా మీద బిజెపి చాలా ఆశలు పెట్టుకుంది
  • గుజరాత్ లో రాజస్థాన్లో సీట్టు తగ్గిపోతే, తెలంగాణా ఆదుకుంటుందని  ఆశ
  • అందువల్ల 13 ఎంపి  సీట్లు, 75 అసెంబ్లీ  సీట్ల మీద గురి

తెలంగాణలో 2019 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించాలని, సాధిస్తుందని చప్పట్లు కొట్టుకున్నారు రాష్ట్ర బిజెపి నాయకులు.  ఈ పార్టీ నేతలకు ప్రధాని మోదీమీద ఎనలేని విశ్వాసం ఉంది. తెలంగాణా  ప్రజల్లో కూడా అంతే విశ్వాసం వుంటుందని, ఈ ప్రేమాభిమానాలనే ఓట్లుగా మార్చునే శక్తి ఉంటే వోట్లు సీట్లు ఫుల్ గా వస్తాయని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక సమావేశం లేక్కలేసుకున్నారు.

ఈ లెక్కాచారం బిజెపి సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి శివప్రకాశ్ సమక్షంలో జరిగింది. ఇంకా లోతైన సమాచారం ఏమిటంటే, గుజరాత్,రాజస్థాన్ వంటి చోట్ల 2019 ఎన్నికల్లో సీట్లు తగ్గుతాయని, ఆలోటును తెలంగాణాతో పూరించుకోవాలనుకుంటున్నారట.  (ప్రమాదమేమో)

 

ఎన్నికలకు రెండున్నరేళ్లే టైం ఉందని,  తొందరగా కార్యక్ర మాలు మొదలుపెట్టి తెలంగాణాలో ఉన్న ఎంపి సీట్లలొ 13 సీట్ల మీద దృష్టి పెట్టాలని, వాటిలో కొన్నయినా తప్పక గెలవాలని ఆయన సూచించారు. అంతేకాదు, ఈ డిల్లీ నాయకుడు చేసిన మరొక సలహా అసెంబ్లీకి సంబంధించి 75 అసెంబ్లీ స్థానాలు గెలిచేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నది. 119 సీట్లున్న అసెంబ్లీలో 75 స్థానాలు గెల్చుకుంటే అధికారంలోకి వచ్చేది బిజెపియే.

 

ఈ ప్రణాళికను దృష్టిలో పెట్టుని 2019 ఎన్నికలకు పూర్తిస్థాయిలో  సన్నద్ధం కావాలని ఢిల్లీ నేత దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం లో పార్టీని బూత్‌స్థాయి నుంచి పటిష్టం చేయాలని, రైతాంగ సమస్యలపై అధిక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.  సమావేశంలో  కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్, ఎన్.రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ పాల్గొనగా, ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు హాజరుకాలేదు.

 

 

 

click me!