తెలుగు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కి బలుపు: పీవీ సింధుపై కోచ్ వ్యాఖ్య అందుకే...

By telugu team  |  First Published Dec 27, 2019, 12:14 PM IST

ఓ పది సంవత్సరాల కిందటి వరకూ భారత బ్యాడ్మింటన్‌ గురించి గొప్పగా చెప్పుకునే అంశాలు ఏమి లేవు. ప్రకాష్ పడుకొనే తరువాత పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ గెలవడం తప్ప చెప్పుకునే విజయాలు సాధించలేదు. ఒలింపిక్‌ మెడల్‌ లేదు, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ స్వర్ణం లేదు, ఒకే ఒక్క సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ ఉండేది. 


ఓ పది సంవత్సరాల కిందటి వరకూ భారత బ్యాడ్మింటన్‌ గురించి గొప్పగా చెప్పుకునే అంశాలు ఏమి లేవు. ప్రకాష్ పడుకొనే తరువాత పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ గెలవడం తప్ప చెప్పుకునే విజయాలు సాధించలేదు. ఒలింపిక్‌ మెడల్‌ లేదు, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ స్వర్ణం లేదు, ఒకే ఒక్క సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ ఉండేది. 

కానీ ఈ పదేండ్లలో పరిస్థితి ఊహకందని రీతిలో మారిపోయింది. ఒలింపిక్‌ పతకాలు, వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ గోల్డ్‌, లెక్కలేనన్ని సూపర్‌ సిరీస్‌ విజయాలు భారత బ్యాడ్మింటన్‌ను అగ్రస్థానంలో నిలిపాయి. 

Latest Videos

undefined

అరకొర విజయాలతో సరిపెట్టుకోకుండా, సంచనాలకు మాత్రమే పరిమితం కాకుండా సూపర్‌ ప్రదర్శనలు ఈ దశాబ్దంలో చూశాం. మహిళల సింగిల్స్‌, పురుషుల సింగిల్స్‌ సహా డబుల్స్‌లోనూ భారత్‌ నుంచి అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ప్రపంచ యవనిక పై కీర్తిపతాకాన్ని రెపరెపలాడించారు. 

బ్యాడ్మింటన్‌ అగ్రదేశాల జాబితాలో ఇప్పుడు భారత్‌ బలంగా తన సత్తాను చాటి చోటు సాధించింది. దీనికి కారణం... తెలుగు తేజం, జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ శిక్షణ సారథ్యమే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 

నాణానికి మరో వైపు తెలియని కధ దాగుంది. భారత బ్యాడ్మింటన్ విజయాలతో ఓ వైపు వెలిగిపోతుండగా... షట్లర్ల ప్రవర్తన సరిగాలేకపోవటంతో విదేశీ కోచ్‌లు ఇబ్బంది పడుతున్న కథ ననాణానికి మరోవైపు కనిపిస్తోంది!. 

షటిల్‌ సూపర్‌ స్టార్‌ పి.వి సింధుకు హృదయం లేదని ఆమె మాజీ వ్యక్తిగత కోచ్‌ కిమ్‌ జీ హ్యూన్‌ (కొరియా) తీవ్ర ఆరోపణలు చేసింది. కిమ్ కొన్ని రోజుల కింద సింధు వ్యక్తిగత కోచ్ గా  నిష్క్రమించింది. కిమ్‌ వ్యాఖ్యలు భారత బ్యాడ్మింటన్‌ వర్గాల్లో కలకలం రేపినా.. ఆమె మాటల్లో వాస్తవం ఎంత అనే డౌట్ కూడా తెరపైకి వచ్చింది. 

Also read: ఇంత పెద్ద దేశంలో వారిద్దరేనా?

భారత డబుల్స్‌ స్పెషలిస్ట్‌ కోచ్‌ ఫ్లాండీ (ఇండోనేషియా) కిమ్‌ వేదన అర్థం చేసుకోగలనని చెప్పటంతో కొరియన్ కోచ్‌ కిమ్ మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జట్టు ప్రయోజనాలను వ్యక్తిగత ప్రయోజనాలు అధిగమించాయని ఫ్లాండీ ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత వేగంగా బ్యాడ్మింటన్‌ శిబిరంలో ఈ ప్రవర్తనను సరిదిద్దకపోతే భవిష్యత్‌లో మరో విదేశీ కోచ్‌ ఇక్కడ పనిచేసేందుకు ముందుకు రాలేరని ఫ్లాండీ హెచ్చరించాడు.

భారత్‌లో విదేశీ కోచ్‌లు నిష్క్రమించడాన్ని అర్థం చేసుకోగలనని, ప్రవర్తన విషయంలో కొందరు భారత ఆటగాళ్లు దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇక్కడ విదేశీ కోచ్‌లు తమ కాంట్రాక్టును వేగంగా ముగించుకోవటం ఓ సంప్రదాయంగా మారిందని, తన వరకు పరిస్థితి వేరుగా ఏమీ లేదని ఫ్లాండీ లింపెలి ఓ ఇండోనేషియా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. 

ఇటీవల భారత్‌లో ముగ్గురు విదేశీ కోచ్‌లు కాంట్రాక్టు గడువు ముగియక ముందే స్వదేశాలకు వెళ్లిపోయారు. వరుసగా ఇలా విదేశీ కోచులు కిమ్‌, ముల్యో ఎదుర్కొన్న అనుభవాలనే తాను కూడా ఎదుర్కొన్నానని ప్లాండి అన్నాడు. 

ఎవరూ కూడా భారత్‌లో 4-5 ఏండ్లకు మించి కోచ్‌గా కొనసాగేందుకు ఇష్టపడరు అని ఫ్లాండీ అభిప్రాయపడ్డాడు. ఈ కోచుల గురించి గనుక చూస్తే వీరి ట్రాక్ రికార్డు పరిశీలిస్తే...ఈ కోచులు భారత బాడ్మింటన్ అభ్యున్నతికి ఎంత కారకులయ్యారో మనకు అర్థమవుతుంది. 

ఇండోనేషియాకే చెందిన ముల్యో శిక్షణలోనే కిదాంబి శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌, హెచ్‌.ఎస్‌ ప్రణర్ లు స్టార్‌ షట్లర్స్‌గా ఎదిగారు. మలేషియా కోచ్‌ టాన్‌ కిమ్‌ హర్‌ శిక్షణలో భారత్‌ డబుల్స్‌ టీం పలు మెడల్స్‌ సాధించింది. కానీ ఆమె ఇప్పుడు భారత్‌ను వీడి జపాన్‌ శిబిరంలో కోచ్‌గా చేరింది. 

సింధు ఫామ్ వెనక కిమ్ కృషి... 

వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ విజేతగా సింధు కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అందుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన ఆరు బిడబ్ల్యూఎఫ్‌ టోర్నీలలో సింధు దారుణంగా విఫలమైంది. ఆ ఆరు టోర్నీలలో ఒక్క ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మాత్రమే సింధు ఫైనల్స్‌కు చేరగల్గింది. 

సింధు పరాజయాల పరంపర: కారణాలు ఇవే...

చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌, కొరియా ఓపెన్‌, డెన్మార్క్‌ ఓపెన్‌, చైనా ఓపెన్‌, హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌లలో సింధు తొలి, రెండో రౌండ్లలోనే పరాజయాన్ని పలకరించింది. తాజాగా బిడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో వరుస ఓటములతో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

సాధారణంగా ఓ ఏడాదిలో వరుసగా వైఫల్యాలు పెద్ద విషయం కాదు. ప్రొఫెషనల్‌ కెరీర్‌లో స్టార్‌ క్రీడాకారులకు ఇది సహజమే. సైనా నెహ్వాల్‌ భీకర ఫామ్‌లో ఉన్న సమయంలోనూ ఆమెనూ ఇటువంటి ఓటములు వెక్కిరించాయి. 

మెన్స్‌ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌దీ ఇదే పరిస్థితి. కానీ 2020 టోక్యో ఒలింపిక్స్‌కు గడువు సమీపిస్తోంది. ఈ సమయంలో భారత స్టార్‌ హంటర్‌ పి.వి సింధు ఫామ్ ఆందోళనకరంగా మారింది. బ్యాడ్మింటన్‌ కోర్టులో సింధు ప్రదర్శన తిరోగమనానికి ఆమె వ్యక్తిగత కోచ్‌ కిమ్‌ జి హ్యూన్‌ (దక్షిణ కొరియా) తప్పుకోవటమే కారణమనే వాదన వినిపిస్తోంది.

కిమ్‌ జి హ్యూన్‌ వ్యక్తిగత కోచ్‌గా ఉన్న సమయంలోనే సింధు వరల్డ్‌ చాంపియన్‌గా అవతరించింది. వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ సాధించింది. చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌పై ఒత్తిడి పెరగటం.. భారత స్టార్‌ ప్లేయర్స్‌ అందరూ గోపీచంద్‌ పర్యవేక్షణలోనే కొనసాగటం సింధుపై ప్రత్యేక దృష్టి సారించేందుకు వీలు లేకుండా చేస్తోంది

ఇక కిమ్ ప్రతిభకు గీటురాయి తాజాగా కిమ్‌ పర్యవేక్షణలోనే పి.వి సింధు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరితే తనను చూసేందుకు ఎవరూ రాలేదని, ఆరోగ్య పరిస్థితి వాకబు చేయకుండా, ప్రాక్టీస్‌కు ఎప్పుడు వస్తారని సింధు అడిగిందని ఇటీవల కిమ్‌ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కోచ్‌లను గౌరవించే సంప్రదాయం భారత బ్యాడ్మింటన్‌లో వేగంగా అంతరించిపోతుందేమోనని అనుమానం మనకు కూడా కలుగక మానదు. 

వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమా? 

బ్యాడ్మింటన్‌కు ఏషియా ఖండాన్ని పవర్‌ హౌజ్ గా చెప్పవచ్చు. భారత్‌ ఈ దశాబ్ద కాలంలో సూపర్‌ పవర్‌గా ఎదిగింది. చైనా, మలేషియా, ఇండోనేషియా, కొరియాలు బ్యాడ్మింటన్ పై ముందు నుంచీ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుతం ఇండోనేషియా డబుల్స్‌ విభాగంలో చక్కగా రాణిస్తోంది. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో తొలి రెండు డబుల్స్‌ స్థానాలు ఇండోనేషియా షట్లర్లే ఆక్రమించుకున్నారు. 

ప్లాండి మాటలను బట్టి గనుక చూసుకుంటే... భారత బాడ్మింటన్ కి నూతన కోచులు ఎవరు కూడా ముందుకు వచ్చే విధంగా కనపదం లేనట్టుగా మనకు అనిపిస్తుంది. జట్టు ప్రయోజనాలకోసం ఆడినప్పుడు మాత్రమే క్రీడాకారులు కూడా ప్రయోజనం పొందుతారు. 

ఇతర ఏషియా దేశాల్లో క్రీడాకారులు బ్యాడ్మింటన్‌ కోచ్ ఆజ్ఞను శిరసావహిస్తారు. వ్యక్తిగత ప్రయోజనాల భావన ఉండదు. పూర్తిగా వ్యవస్థకు లోబడి నడుచుకుంటారు. భారత్‌లో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. భారత ఆటగాళ్ల ఈ ప్రవర్తనన అర్జెంటు గా మారాలి. 

టోక్యో 2020 ఒలింపిక్స్‌ డబుల్స్‌ విభాగంలో పతకమే ధ్యేయంగా ఫ్లాండీని భారత బ్యాడ్మింటన్‌ ప్రత్యేకంగా డబుల్స్‌ విభాగం కోసం నియమించింది. సాత్విక్‌సాయిరాజ్‌, రాంకీ రెడ్డి, చిరాగ్‌ శెట్టి, మను అత్రి, సుమిత్‌ రెడ్డిలపై ప్రత్యేకమైన ఫోకస్‌తో ఫ్లాండీ శిక్షణ ఇస్తున్నారు. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రాంకీ రెడ్డి, అశ్విని పొన్నప్ప.. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్పలు ఫ్లాండీ పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతున్నారు. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ సహచరులు కలిసికట్టుగా కష్టపడాలి, ఒకరికొకరు మెరుగుపడాలి, ఒకరితో ఒకరు పోటీపడాలి.. ఉమ్మడిగా మెరవాలి. సహచర షట్లర్‌ ప్రదర్శనతో సంబంధం లేకుండా తన ఆట మాత్రమే బాగుంటే చాలు అనే భావన డబుల్స్‌ విభాగంలో పోటీపడే షట్లర్లకు ఉండడం హర్షించదగ్గ విషయం కాదు. టీం స్పిరిట్ బాగుండాలి. 

click me!