అనాథల విక్టోరియా హోమ్ మీద కన్నేసిన రాచకొండ పోలీసులు

First Published Aug 18, 2017, 11:00 AM IST
Highlights
  • హోమ్ లో దాదాపు 600 మంది అనాథలు విద్యనభ్యసిస్తున్నారు.
  • అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు సూచనల మేరకు దానిని విక్టోరియా మెమోరియల్ హోమ్ గా పేరు మార్చారు

 

అది ఓ అనాథల విద్యాలయం. తమకంటూ ఎవరూ లేక.. అనాథాశ్రమంలో జీవనాన్ని గుడుపుతూ.. అందులోనే విద్యను అభ్యసిస్తున్నారు.  అదే విక్టోరియా మెమోరియల్ హోమ్.  ఇక నుంచి ఆ హోమ్ లో కనపడేది విద్యార్థులు కాదు... అన్నీ ఖాఖీ చొక్కాలే కనిపిస్తాయి. అనాథల హోమ్ పై ఇప్పుడు పోలీసుల కన్ను పడింది. ప్రభుత్వం సహాకారంతో దానిని చెజిక్కించుకున్నారు.

సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ ని పోలీసు కమిషనర్ హెడ్ క్వార్టర్స్ గా మార్చనున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు కూడా జారీ చేసింది. 10 ఎకరాలలోని హోమ్ ని 11 సంవత్సరాల పాటు లీజుకి ఇస్తూ ప్రభుత్వతం నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 11వ తేదీనే నోటీసుల జారీ చేయగా.. గురువారం దీనిని అధికారికంగా ప్రకటించారు.

10 ఎకరాలలో కమిషనరేట్ భవనాన్ని నిర్మించేందుకు 32,348 స్వ్కేర్ యార్డ్స్ భూమి అవసరమం. కాగా సంవత్సరానికి  ఒక్కో స్వ్కేర్ యార్డ్ ధర రూ.35,000 వేలకు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది.

ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ తన కోసం ఎంతో ఇష్టంగా ఇప్పటి సరూర్‌నగర్‌లో 1901లో ఈ భవనాన్ని కట్టుకున్నారు. 1903 జనవరి ఒకటో తేదీన ప్రారంభించారు. విక్టోరియా మహారాణి పేరుతో అందులో అనాథాశ్రమం పెట్టాలని భావించారు. సరిగ్గా 115 ఏళ్ల కిందట 75 ఎకరాల స్థలాన్ని ఇందుకు కేటాయించారు. 1905లో దీనికి విక్టోరియా ఆర్ఫాన్జ్ అండ్ టెక్నికల్ స్కూల్ గా ఏర్పాటు చేశారు. కాగా.. 1953లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు సూచనల మేరకు దానిని విక్టోరియా మెమోరియల్ హోమ్ గా పేరు మార్చారు. ఈ హోమ్ లో దాదాపు 600 మంది అనాథలు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ఎక్కవ మంది బాలికలు ఉన్నారు.

అనాథలకు విద్యనందించాలని ఎత్తో ఉన్నతంగా ఆలోచించి  నిజాం రాజు ఈ హోమ్ ని ఏర్పాటు చేస్తే.. ప్రస్తుతం దీనిని పోలీసుల హెడక్వార్టర్స్ గా ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది.

విక్టోరియా మెమోరియల్ కి చెందిన భూములను ఇప్పటికి  చాలా సార్లు ప్రభుత్వం దారాదత్తం చేసింది. గతంలో రైతు బజార్, బాబు జగ్జీవన్ రామ్ భవన్, రిలయన్స్ ఫ్లూయల్ స్టేషన్ ల నిర్మాణం కోసం లీజుకు ఇచ్చారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం కూడా 10 ఎకరాలను ఇచ్చేశారు.

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూలు తరహాలో వీఎం హోమ్‌ను తీర్చిదిద్దాలని గతంలో ప్రయత్నాలు జరిగాయి. ఒకటో తరగతిలో చేరిన విద్యార్థి ఉద్యోగం సాధించి బయటకు వెళ్లేలా ఇక్కడ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని, హోంను ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని అప్పటి ఎస్సీ గురుకులం కార్యదర్శి పూనం మాలకొండయ్య ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వర్కింగ్‌ ఉమెన హాస్టల్‌ పెట్టాలని, డిగ్రీ స్థాయికి కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రతిపాదించారు. కానీ, అవేవీ కార్యరూపం దాల్చలేదు. కాగా.. ఇప్పుడు పోలీసులకు నిలయంగా మారింది.

click me!