ఐఫోన్ ఎక్స్ ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్ ఫోన్

First Published Mar 24, 2018, 3:26 PM IST
Highlights
  • అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన వివో వీ9

ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ వివో.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. వివో వీ9 పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ లో  యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ ఎక్స్ ఫీచర్లను కొన్నింటిని పొందుపరచడం విశేషం. దీనికి పై భాగంలో ఐఫోన్ X తరహాలో నాచ్‌ను ఏర్పాటు చేశారు. ఫోన్ వెనుక భాగంలో 16, 5 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలు, ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను అమర్చారు.

సెల్ఫీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. దీని వల్ల ఈ కెమెరాతో డివైస్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ యూజర్ ముఖాన్ని స్కాన్ చేసుకుని ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఏఆర్ స్టిక్కర్స్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో యూజర్లు సెల్ఫీ కెమెరాతో తీసుకునే తమ ఫోటోలను స్టిక్కర్లుగా మార్చుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌లో మెమొరీ కార్డ్, డ్యుయల్ సిమ్ కార్డుల కోసం వేర్వేరుగా స్లాట్లు ఇచ్చారు. రూ.22,990 ధరకు ఈ ఫోన్ ఏప్రిల్ 2వ తేదీ నుంచి లభ్యం కానుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్‌లలో ఈ ఫోన్‌ను ముందుగానే ప్రీ ఆర్డర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. 

వివో వి9 ఫీచర్లు... 
6.30 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (ఫ్లాష్), 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

click me!