స్థిరాస్తిని అమ్ముతున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

First Published Nov 3, 2017, 12:41 PM IST
Highlights
  • దాదాపు చాలా మంది పెట్టుబడులను మన దేశంలో స్థిరాస్తులపైనే పెడుతుంటారు. ఎందుకుంటే.. భవిష్యత్తులో మంచి లాభాలు సాధించవచ్చు.. అనే అభిప్రాయంతో వీటిపై అధిక పెట్టుబడులు పెడతారు.
  • పెట్టుబడులకు తగ్గట్టుగానే ఈ రంగంలో లాభాలు కూడా బాగానే ఉంటాయి. అయితే.. రాబడిని బట్టి.. పన్ను చెల్లించాల్సి ఉంటుంది

స్థిరాస్తి.. దీనికి డిమాండ్ చాలా ఎక్కువ. పెరగుతున్న జనాభా ఇందుకు మరింత ఊతమిస్తుంది. దాదాపు చాలా మంది పెట్టుబడులను మన దేశంలో స్థిరాస్తులపైనే పెడుతుంటారు. ఎందుకుంటే.. భవిష్యత్తులో మంచి లాభాలు సాధించవచ్చు.. అనే అభిప్రాయంతో వీటిపై అధిక పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులకు తగ్గట్టుగానే ఈ రంగంలో లాభాలు కూడా బాగానే ఉంటాయి. అయితే.. రాబడిని బట్టి.. పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కాదు.. అమ్మకాలు చేసినప్పుడు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే స్థిరాస్తి అమ్మకాలు జరిపేటప్పుడు మూలధన లాభాల( క్యాపిటల్ గెయిన్స్) గురించి ఒకసారి ఆలోచించుకోవాలి.

అసలు ఏమిటీ.. క్యాపిటల్ గెయిన్స్.. వాటిలోని రకాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏదైనా ప్రాపర్టీని అమ్మినప్పుడు దానికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని విధిస్తారు. ఇవి రెండు రకాలు.. 1. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. 2. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్.

ఏదైనా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసి.. దానిని ఒక వ్యక్తి రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం తన వద్ద ఉంచుకొని.. ఆ తర్వాత అమ్మాలనుకున్నప్పుడు దానికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్  చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంవత్సర కాలపరిమితి దాటిన ఏ స్థిరాస్తి కైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. అదే బంగారం అయితే.. 3 సంవత్సరాల వరకు ఆ వ్యక్తి వద్ద ఉంచుకోవచ్చు.  రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు కనీస కాల పరిమితి 36నెలలు లేదా మూడు సంవత్సరాలు. ఆ  సమయం వరకు ఆ వ్యక్తి వద్ద వాటిని ఉంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ వ్యవధిని 18నుంచి 24 నెలలకు తగ్గించారు. కాల పరిమితికి మించి  ఆవ్యక్తి వద్ద ఈ స్థిరాస్తిని ఉంచుకుంటే.. వాటికి ఈ పన్ను చెల్లించాలి.

ఈక్విటీ ఇనుస్ట్రిమెంట్స్ కి కనీస కాల పరిమితి సంవత్సరం, డెబ్ట్ ఇనుస్ట్రిమెంట్స్ కి సంవత్సరం, గవర్నమెంట్ బాండ్స్ 1సంవత్సరం.బంగారం.. ఫిజికల్ గోల్డ్ కి 36నెలలు, ఈ-గోల్డ్ కి 12నెలలు.రియల్ ఎస్టేట్.. 36నెలలు( 2017-18 ఆర్థిక సంవత్సరానికి దీనిని 24నెలలకు కుదించారు) ఈ పరిమితి దాటితే దానికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి.

ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసిన రెండు సంవత్సరాలలోపు దానిని అమ్మేస్తే వచ్చే లాభాలపై స్వల్పకాల మూలధన లాభాల పన్ను( షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) విధిస్తారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని  లెక్కించేందుకు లాభాలను పన్ను చెల్లింపుదారి ఆదాయానికి జత చేస్తారు. పన్ను చెల్లింపుదారు శ్లాబుని బట్టి పన్నును నిర్ణయిస్తారు. ఇందులో సెక్యురిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని కూడా జత చేస్తారు.

మ్యూచువల్ ఫండ్స్ లో.. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్..

ఈక్విటీ ఫండ్ కనీస కాలపరిమితి ఒక సంవత్సరం. దీనికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్.. 15శాతం పడుతుంది. అంతేకాకుండా అదనంగా సర్ ఛార్జ్, ఎడ్యుకేషన్ సెస్ లు కూడా కట్టాల్సి ఉంటుంది. ఇక డెబ్ట్ ఫండ్ విషయానికి వస్తే.. దీని కాల పరిమితి మూడు సంవత్సరాలు. దీనిలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్.. ట్యాక్స్ స్లాబ్ ని బట్టి నిర్ణయిస్తారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్  పన్ను.. 20శాతం కట్టవలసి ఉంటుంది.

రియల్ ఎస్టేట్స్ లో.. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్..

రియల్ ఎస్టేట్స్.. ఇమ్ మూవబుల్ ప్రాపర్టీ లేదా.. ఇంటి ప్రాపర్టీకి కాల పరిమితి  36నెలలు( ఇఫ్పుడు 24నెలలకు కుదించారు).దీనికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్  20శాతం చెల్లించాలి.  షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్.. ట్యాక్స్ స్లాబ్ ని బట్టి నిర్ణయిస్తారు.

ఈ పన్ను మినహాయింపు పొందడం ఎలా..?

మూలధన ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చే  లాభాలకు సెక్షన్ 54(ఎఫ్) కింద మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ సెక్షన్ 54( ఎఫ్) ప్రకారం ఇలా వచ్చిన లాభాలను మరో ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి వినియోగించాలి. అప్పుడే పన్ను మినహాయింపు లభిస్తుంది. స్థిరాస్తిని అమ్మగా వచ్చిన లాభాలతో కనీసం రెండేళ్లలోపు మరో స్థిరాస్తిని కొనుగోలు చేయాలి. అప్పుడు పన్ను మినహాయింపు వస్తుంది.లేదా... మూలధన ఆస్తిని విక్రయించిన ఆరు నెలల లోపు బాండ్లలో పెట్టుబడులు పెడితే సెక్షన్ 54(ఈసీ) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

 

అథిల్ శెట్టి, బ్యాంకు బజార్.కామ్ సీఈవో

click me!