ప్రధాని నవంబర్ 8 ప్రసంగం ‘లైవ్’ బోగసా

First Published Dec 1, 2016, 9:05 AM IST
Highlights

అవును బోగస్ అంటున్నారు, జర్నలిస్టు సత్యేంద్ర మురళి

అది లైవ్ కాదు, గతంలో ఎపుడో రికార్డు చేశారు. కట్స్  ఉన్నాయి చూడండి

టివిలన్నింటికి ’లైవ్ ’  ట్యాగ్ తగిలించుకోమన్నారు

నవంబర్ 8, 2016-1216

ఈ తరం బాగా గుర్తుంచుకోవలసి తేదీలలో చేరిపోయిన తారీఖు ఇది.

ఎందుకంటే ఆ రోజు ప్రధాని నరేంద్రమోడీ జాతి నుద్దేశించి ప్రసంగించారు. అకస్మింగా భారత జాతి ప్రధాని నోటి నుంచి నోట్ల రద్దు అనే మాట వినబడింది.  అయిదొందలు, వేయి నోట్ల ను రద్దు చేస్తామని ప్రధాని ప్రకటించడం, దేశ ద్రవ్య ఛలామణి వ్యవస్థ ఛిన్నభిన్నమయిన రోజు అదే. 23 రోజులయినా,  ఆ తేదీ తెచ్చిన కష్టాలు తీర లేదు.

 

 అయితే, ఆరోజు దూరదర్శన ప్రసారం చేసిన ప్రధాని ప్రసంగం ఆరోజుది కాదట. ప్రధాని ఉన్నట్లుండి చేసిన ప్రకటన కూడా కాదట. దూరదర్శన్ జర్నలిస్టు సత్యేంద్ర మురళి గుట్టు రట్టు చేశారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం ప్రధాని ప్రసంగం ‘లైవ్’ కాదు, అంతకు ముందే రికార్డు చేసిందట.

 

సత్యేంద్ర మురళీ ఢిల్లీలో విలేకరుల సమావేశ ఏర్పాటు చేసి ఈ విషయం వివరించారు.  నోట్ల రద్దు విషయం నవంబర్ ఎనిమితో తేదీనే ప్రకటించినా,  ఆ నిర్ణయం చాలా రోజుల ముందే జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. టివిలలో ‘లైవ్’గా ప్రసారమయిన  ప్రధాని ప్రసంగం అసలు లైవ్ కాదట. చానెళ్లన్నింటిని ‘లైవ్’ ట్యాగ్ తగిలించి ప్రసారం చేయమన్నారని ఆయన వెల్లడించారు.

 

ఈ విషయం వెల్లడించినందుకు సత్యేంద్ర మురళికి ఇపుడు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నయి. ఆయన ఫేస్ బుక్ నిండా ఆయన్ను తిడుతూ చేసిన కామెంట్లే కనిపిస్తాయి.

 

అయితే, సత్యేంద్ర మురళీ తన చేస్తున్న ఆరోపణ మీద నిలబడుతున్నారు. తొందర్లోనే తాను తను చేసిన ఆరోపణలకు అధారాలను దేశ ప్రజల ముందుంచుతానంటున్నారు. ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం అధికారికంగా సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 

నవంబర్ 8న  ప్రధాని చేసిన ప్రసంగం బోగస్ అంటున్నారు. “ నవంబర్ 8 తేదీ సాయంకాలం అరు గంటలకు నేను రిజర్వుబ్యాంకు నుంచి  అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత ఏడు గంటలకు క్యాబినెట్   క్యాబినెట్ సమావేశం జరిగింది. ఏనిమిది గంటలకు  జాతినుద్దేశించి మాటాడాను,’ అనే ప్రధాని ప్రకటన బోగస్ అని సత్యేంద్ర మురళీ అన్నారు.

 

ప్రధాని ప్రసంగంలోని కట్స్ చూస్తే ప్రధాని ప్రసంగాన్ని ప్రసారానికి ముందే ఎడిట్ చేశారని తెలుస్తుందని సత్యేంద్ర మురళి చెబుతున్నారు. లైవ్   ప్రసంగం అయినపుడు ఎడిట్ చేయడం ఎలా సాధ్యం, అనేది మురళీ ప్రశ్న. 

ఇంతకి విషయమేమిటంటే, ప్రకటన అప్పటికప్పుడు చేసింద కాకుండా రికార్డయినదయితే,  నోట్ల రద్దు విషయం బయటకు పొక్కే అవకాశమెక్కువ.

click me!