సోషల్ మీడియా వేదిక ‘ఫేస్ బుక్’ సీఈఓగా మార్క్ జుకర్ బర్గ్ వైదొలిగే తరుణం ఆసన్నమైందని తెలుస్తోంది. జుకర్ బర్గ్ కూడా కొన్ని బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం
సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌బుక్’ సీఈఓగా సంస్థ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తప్పుకోనున్నారా? అవును ఇది నిజం. మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్.. జుకర్ బర్గ్ స్థానే ఫేస్ బుక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ మాజీ సెక్యూరిటీ అధికారి అలెక్స్ స్టామోస్ బయటపెట్టారు.
పలు కుంభకోణాలు, డేటా తస్కరణ ఆరోపణలతో ఫేస్ బుక్ యాజమాన్యం కొంత కాలంగా ఒత్తిడికి గురవుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ సహా వ్యవస్థాపకుల్లో ఒకరైన జుకర్ బర్గ్.. ఇక ముందు పేస్‌బుక్‌పై కొంత నియంత్రణ తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు.
undefined
అందుకోసం ఫేస్‌బుక్‌కు నూతన సీఈఓగా బ్రాడ్ స్మిత్‌ను నియమించుకోవాలని తలపోశారు జుకర్ బర్గ్. ఇటీవల జరిగిన ఓ సదస్సులో ఫేస్ బుక్ మాజీ చీఫ్ సెక్యూరిటీ అధికారి అలెక్స్ స్టామోస్ ఈ విషయాలు చెప్పారు.
ఫేస్‌బుక్‌లో జుకర్‌బర్గ్‌కు అవసరాన్ని మించిన అధికారం ఉన్నదని, దీన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉన్నదని స్టామోస్ తెలిపారు. ఫేస్‌బుక్‌లో ఉత్పత్తులను ఎలా నిర్మించాలన్నా, తయారు చేయాలన్న సంస్థలో ఇంటర్నల్ రివల్యూషన్ అవసరం ఉన్నదని స్టామోస్ చెప్పారు.
ఫేస్ బుక్ సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా పోరాడిన స్టామోస్... గతేడాది ఆగస్టులో సంస్థను వీడారు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో పూర్తికాలం టీచర్‌గా, రీసెర్చర్‌గా చేరిపోయారు.
అయితే ఇటీవల ఫేస్ బుక్ కో ఫౌండర్లలో ఒకరైన చిరిస్ హుగెస్.. మార్క్ జుకర్ బర్గ్‌ను అక్కౌంటబుల్‌గా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, సోషల్ నెట్ వర్కింగ్ జెయింట్‌ను విడగొట్టాల్సిన అవసరం ఉందని కూడా వ్యాఖ్యానించారు.
చిరెస్ హుగెస్ వ్యాఖ్యలపై ప్రస్తుతం చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్న సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెర్ల్య్ శాండ్ బర్గ్ తోసిపుచ్చారు. ఫేస్ బుక్ విభజన వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తేల్చేశారు.
పలువురు అమెరికా సెనెటర్లు కూడా ఫేస్ బుక్ ను విడగొట్టాలన్న ప్రతిపాదనలు తెచ్చారు. వారిలో ఇండో అమెరికన్ సెనెటర్ కమలా హరీస్ కూడా ఉన్నారు.