దీపక్ మిశ్రా పై అభిశంసన.. సుప్రీం కోర్టుకు కాంగ్రెస్

First Published Apr 24, 2018, 10:47 AM IST
Highlights

అభిశంసనను తోసిపుచ్చిన వెంకయ్య

జస్టిస్ దీపక్ మిశ్రా అభిసంశనపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరిచిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ లో ఉన్న ఆయన.తన పర్యటన ను అర్ధంతరంగా రద్దు చేసుకుని ఆదివారం మధ్యాహ్నం హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దీపక్ మిశ్రా అభిశంసనపై ఆయన ఇదివరకే అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ తో సహా.. రాజ్యసభ సెక్రటేరియట్ కు చెందిన సీనియర్ అధికారులతో చర్చించారు. అనంతరం సోమవారం దానిని తోసిపుచ్చారు.

ఏడు పార్టీలకు చెందిన71 మంది ఎంపీల సంతకాలతో కూడిన అభిశంసన నోటీసును కాంగ్రెస్ నేతలు తయారు చేశారు. తమ అభిశంసన నోటీసును పరిగణలోకి తీసుకోకపోతే.. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. అయితే.. దానిని వెంకయ్య తాజాగా తోసిపుచ్చడంతో.. వారు ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లేందుకే
 నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాము పెట్టిన అభిశంసన నోటీసును తోసిపుచ్చడం సరైన నిర్ణయం కాదని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. తాము కచ్చితంగా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన మీడియా ముందు తెలియజేశారు.

click me!