ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏంచేయాలో తెలుసా?

First Published Nov 17, 2017, 11:45 AM IST
Highlights
  • మనదేశంలో ప్రస్తుతం ప్రతీదానికి ఆధార్ తప్పనిసరి
  • ఆధార్ బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ గురించి ఎప్పుడైనా విన్నారా?
  • ఆధార్ లోని మన వ్యక్తిగత సమాచారాన్ని లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు.

‘ఆధార్’.. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా.. ప్రభుత్వం పథకాలను పొందాలన్నా.. ఇలా ఒకటేంటి ప్రతిదానికీ ఆధార్ తప్పనిసరి అయ్యింది. బ్యాంక్ ఖాతాలకు కూడా ఆధార్ అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అయితే.. దీనిపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మన వ్యక్తిగత విషయాలు ఆధార్ ద్వారా అందరికీ తెలిసిపోతాయి కదా.. ఎవరైనా వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కదా..నిజమే.. మరి దానిని అరికట్టడం ఎలా? ఇంకెందుకాలస్యం చదివేయండి..

ఆధార్ బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ గురించి ఎప్పుడైనా విన్నారా? యూఐడీఏఐ( యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) దీనిని మనకు అందిస్తోంది. దీని ద్వారా ఆధార్ లోని మన వ్యక్తిగత సమాచారాన్ని లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు.

బయోమెట్రిక్ సమాచారం..

ఆధార్ మన సమాచారాన్ని రెండు రకాలుగా సేవ్ చేస్తుంది. ఒకటి బయోమెట్రిక్స్,  రెండోది డెమోగ్రాఫిక్. బయోమెట్రిక్స్ లో మన ఐఆర్ఐఎస్, ఫింగర్ ప్రింట్స్, ఫేసియల్ స్కాన్ లాంటి సమాచారం ఉంటుంది. ఇక డెమోగ్రాఫిక్ లో డేట్ ఆఫ్ బర్త్, వయసు, పేరు, జెండర్, ఈ మెయిల్ వంటి సమాచారం ఉంటుంది.

బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్, అన్ లాక్ చేయడం ఎలా..

ఒకసారి మీ ఆధార్ సమాచారాన్ని లాక్ చేస్తే.. మళ్లీ తిరిగి అన్ లాక్ చేసే వరకు ఆ సమాచార్ని ఎవరూ ఉపయోగించడానికి కుదరదు. అంత సెక్యూర్డ్ గా ఉంటుంది. అయితే.. ఈ ఫెసిలిటీ పొందాలంటే.. ఆధార్ తో మీ ఫోన్ నెంబర్  రిజిస్టర్ చేసి ఉండాలి. అలా లేకపోతే సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి.. ఫామ్ ఫిలప్ చేసుకోవాలి.

ఇప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ చేయడం ఎలాగో చూద్దాం.. ముందుగా యూఐడీఏఐ వెబ్ సైట్ ని ఓపెన్ చేయాలి. దాంట్లో ఆధార్ సర్వీసెస్ అనే ట్యాబ్ ని ఓపెన్ చేయాలి. ఆ తర్వాత  ' lock/unlock biometrics' అనే లింక్ ని క్లిక్ చేయాలి. అప్పుడు https://resident.uidai.gov.in/biometric-lock పేజీ ఓపెన్ అవుతుంది.

ఆ పేజీలో ఆధార్ నెంబర్, సెక్యురిటీ కార్డులో అందులో ఇవ్వాల్సి ఉంటుంది. ( సెక్యురిటీ కోడ్.. ఓటీపీ ద్వారా మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ కి వస్తుంది). ఆ ఓటీపీతో లాగిన్ అయ్యి..మీ బయోమెట్రిక్ సమాచారన్ని లాక్ చేసుకోవచ్చు. ఇలా లాక్ చేసుకుంటే.. బ్యాంక్ ట్రాన్సక్షన్స్ లాంటి వాటికి ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. వాటికి దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం మీ ఆధార్ సమాచారం సెక్యూర్డ్ గా ఉండేందుకు ఈ లాకింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఎవరైనా మీ బయోమెట్రిక్ సమాచారాన్ని చోరీ చేయాలని చూసినా, మిస్ యూస్ చేయాలని ప్రయత్నించినా.. వారికి 330 అనే ఎర్రర్ కోడ్ వస్తుంది.

ఇప్పుడు అన్ లాక్ చేయడం ఎలాగో చూద్దాం..

ఆధార్ వెబ్ సైట్ ఓపెన్ చేసి.. అందులో మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ నెంబర్ తో లాగిన్ అయ్యి.. అన్ లాక్ చేసుకోవచ్చు. అన్ లాక్ చేస్తున్న సమయంలో.. మీకు రెండు ఆప్షన్స్ కనపడతాయి. ఒకటి అన్ లాక్ లేదా డిసేబుల్ లాక్. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆప్షన్ ని ఎంచుకోవచ్చు.

ఒక్కసారి మీ బయోమెట్రిక్ సమాచారాన్ని అన్ లాక్ చేస్తే.. అలా చేసిన పది నిమిషాల తర్వాత మీరు ఆ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. అన్ లాక్ చేసే సమయంలో మీరు డిసేబుల్ అనే  ఆప్షన్ ఎంచుకొని ఉంటే.. అన్ లాక్ చేసిన పది నిమిషాలకు మళ్లీ లాక్ అవుతుంది.

ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని వెంటనే లాక్ చేసేసుకోండి. ఇది చేసుకోవడం చాలా సులభం. పాస్ వర్డ్ గుర్తుంచుకోవాలన్న బాధలు ఉండవు. కేవలం మీ ఆధార్ నెంబర్, రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి బయోమెట్రిక్ సమాచారాన్ని అప్ డేట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా.. ఏదైనా ప్రమాదం జరిగి బయోమెట్రిక్స్ లో మార్పులు వస్తే.. అప్పుడు డేటాని అప్ డేట్ చేసుకోవాలి.

 

అథిల్ శెట్టి, బ్యాంక్ బజార్.కామ్ సీఈవో

click me!