యుద్ధభూమిలో విజయవాడ డాక్టర్

First Published Sep 7, 2017, 11:36 AM IST
Highlights
  • సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలకు తెగించి యుద్ధాలు చేసే వారికి వైద్య సేవలు అందిస్తోంది.
  • ఆమె కళ్ల ముందే బాంబు దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి
  • తన మోముపై చిరునవ్వు చెదరనివ్వకుండా వైద్య సేవలు అందిస్తోంది.

 ‘వైద్యో నారాయణో హరి’ అన్నారు పెద్దలు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడగలిగేది వైద్యుడు ఒక్కడే. అందుకే వాళ్లని దేవుడితో పోల్చారు. నిజమే.. డాక్టర్లు ప్రాణాలను కాపాడతారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ షైని. అందరిలా.. ఆమె హాస్పటల్ లో అన్ని సౌకర్యాల మధ్య కూర్చొని వైద్యం చేయడం లేదు. సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలకు తెగించి యుద్ధాలు చేసే వారికి వైద్య సేవలు అందిస్తోంది.  అది కూడా నిత్యం ఆకలితో పోరాడుతూ.. సరైన సదుపాయాలు లేక జీవన్మరణ సమస్యలతో తల్లడిల్లే నైజీరియా, యెమెన్, సోమాలియా వంటి దేశాలలో.  ఆమె కళ్ల ముందే బాంబు దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. చిన్న పిల్లలు సైతం మారణాయుధాలు చేత పట్టుకొని తిరగడం  కూడా ఆమె చూసింది. అలాంటి ప్రాంతాలకు ఎవరూ  వెళ్లడానికి కూడా సాహసించరు. కానీ ఆమె మాత్రం  ఎంతో ధైర్యంతో నిలబడింది. అంతేకాదు.. తన మోముపై చిరునవ్వు చెదరనివ్వకుండా వైద్య సేవలు అందిస్తోంది. అసలు ఎవరీ డాక్టర్ షైని.. మన దేశ సరిహద్దులు దాటి ఆ దేశాల్లో ఎందుకు సేవలు అందిస్తోందో తెలుసుకందామా..

విజయవాడకు చెందిన షైని.. వెల్లూరులోని సీఎంసీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం రెండు సంవత్సరాల పాటు అహ్మదాబాద్ లోని ఓ గ్రామీణ ప్రాతంలో కుష్టు రోగులకు వైద్యసేవలు అందించారు. అంతేకాకుండా అక్కడికి వచ్చే కుష్టు రోగులకు ఆమె ధైర్యం చెప్పేవారు. కుష్టు రోగం నయం కాదు అనే భావనలో ఉండవద్దని.. యాంటి బయాటిక్ ఇంజిక్షన్ ఇస్తే.. 90శాతం తగ్గిపోతుందని.. మిగిలిన 10శాతం తగ్గడానికి కొన్ని రోజులు హాస్పిటల్ లో చికిత్స పొందాలని ఆమె రోగులకు చెప్పేవారు.

అనంతరం ఆమె వెల్లూరులోని ట్రస్ట్ రీసర్చ్ లాబ్ లో కొంత కాలం పరిశోధనలు జరిపారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న నరికురవ తెగలకు చెందిన వారిపై భారత్ తరపు నుంచి పరిశోధనలు జరిపారు. అప్పుడే పుట్న పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం లేదట. అందుకే వారిలో పోషకాహార లోపం తలెత్తుతున్నట్లు ఆమె గుర్తించారు. దాదాపు 2 సంవత్సరాల పాటు దీనిపై పరిశోధనలు జరిపిన ఆమె 2013 సెప్టెంబర్ తర్వాత మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ లో చేరింది. అంటే ఏ సరిహద్దుల్లో అయితే వైద్యులు ఉండరో.. అందులో చేరారు. అది ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

 ఇందులో భాగంగా మొదట ఆమె ఇథియోపియా, సోమాలియా రెండు దేశాల సరిహద్దులో వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత నైజీరియా, సౌత్ సదన్, యెమెన్ వంటి దేశ సరిహద్దుల్లో సేవలు అందించారు.

ఒకసారి తన కజిన్ ఒకరు కారు ప్రమాదంలో చనిపోయారట. దాని నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందట. అప్పుడే తనలో ఒక ఆలోచన వచ్చిందట. చావు ఎంతటి వారినైనా బాధిస్తుంది. వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పుడే ఇంత మంది చనిపోతుంటే.. అసలు వైద్య సేవలు లేని చోట ఇంకా భయంకరంగా  ఉంటుంది కదా అని తనకు అనిపించిదట. అంతే వెంటనే అలాంటి ప్రాంతాల్లో వైద్యం చేయాలని నిర్ణయించుకున్నానని చెబుతుంది.. 30 ఏళ్ల షైని. అందులో భాగంగానే ఈ యెమెన్,సోమాలియా వంటి దేశాలలో సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.

సాధారణంగా హాస్పిటల్ లోకి ఆయుధాలు అనుమతించారు. కానీ ఈ దేశాలలో.. చిన్న పిల్లలు సైతం చేతిలో తుపాకీలు పట్టుకొని తిరుగుతూ ఉంటారని ఆమె చెప్పారు. కాకపోతే తాము డాక్టర్లమని.. వారి ప్రాణాలు కాపాడటానికి వచ్చామని తెలిసి తమను ఏమి చేయలేదని తనకు ఎదురైన  అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అక్కడ ఆమె అత్యవసర విభాగం, హెచ్ఐవీ, టీబీ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యం చేసేవారు. శరణార్థులు ఎక్కువ మంది ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల వ్యాధులు త్వరగా ప్రబలేవని..వారిలో పోషకాహార లోపం ఎక్కువగా కనిపించేందని షైని తెలిపారు.

                                                                                        మరిన్ని తాజా వార్తాల కోసం క్లిక్ చేయండి

 

click me!