వలస వచ్చి.. వండర్స్ క్రియేట్ చేశారు..!

First Published Oct 20, 2017, 1:16 PM IST
Highlights
  • జీవనోపాధి కోసం చాలా మంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసపోతుంటారు.
  • అలా ఇతర దేశాల నుంచి వలస వచ్చి.. అమెరికాలో స్థిరపడిన వాళ్లు చాలా మందే ఉన్నారు.
  • అయితే వారిలో కొందరు.. వండర్స్ క్రియేట్ చేశారు.
  • ప్రపంచ వ్యాప్తంగా తమకంటూ గుర్తింపు సంపాధించుకున్నారు.

పుట్టి పెరిగిన ఊరుని కాదని.. వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి స్థిరపడే వాళ్లని వలసదారులు అని పిలుస్తారు. జీవనోపాధి కోసం చాలా మంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసపోతుంటారు. అలా ఇతర దేశాల నుంచి వలస వచ్చి.. అమెరికాలో స్థిరపడిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే వారిలో కొందరు.. వండర్స్ క్రియేట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తమకంటూ గుర్తింపు సంపాధించుకున్నారు. అలా వండర్స్ క్రియేట్ చేసిన కొందరి గురించి పరిశీలిస్తే...

సెర్గీ బ్రిన్...

సెర్గీ బ్రిన్.. పుట్టింది రష్యా దేశంలో. ఆయనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు.. అతని తల్లిదండ్రులతో కలిసి అమెరికా వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ప్రస్తుత రోజుల్లో మనం ఎలాంటి సమాచారం కావాలన్నా.. గూగుల్ లో సెర్చ్ చేస్తాం. ఆ గూగుల్ పేరెంట్ కంపెనీ గూగుల్ ఆల్ఫాబేట్ కి ప్రెసిడెంట్ ఈ సెర్గీ బ్రిన్. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో సెర్గీ ఒకరు. ప్రపంచంలోని తొలి వంద అత్యంత ధనవంతుల్లో సెర్గీ 12వ స్థానంలో ఉన్నారు. మ్యాథమెటిక్స్ చదివిన సెర్గీ.. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్ డీ చేశారు.

రష్యాలో ఉపాధి దొరకక సెర్గీ తండ్రి అమెరికా వలస వచ్చారు. ఇప్పుడు సెర్గీ.. చాలా మంది ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. అందుకే సెర్గీ.. రష్యా నుంచి అమెరికా తీసుకువచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ ఉంటాడట.

రూపర్ట్ ముర్దోక్

రూపర్ట్ ముర్దోక్... ఈ పేరుచాలా సార్లు వినే ఉంటారు. ఎందుకంటే ఈయన ఒక మీడియా మొఘల్. ఆస్ట్రేలియాలో పుట్టిన రూపర్ట్.. తర్వాత అమెరికాలోనే స్థిరపడ్డారు. రూపర్ట్ తండ్రి కేత్ ముర్డోచ్.. ఓ రిపోర్టర్, ఎడిటర్. అంతేకాకుండా హెరాల్డ్, వీక్లీ టైమ్స్ న్యూస్ పేపర్స్ కంపెనీ సీనియర్ ఎక్సిక్యూటివ్. అయితే.. కేత్ మరణం తర్వాత.. రూపర్ట్.. తన తండ్రి కంపెనీని కొనసాగించలేదు. స్వతహాగా ఓ ప్రైవేటు సంస్థని ఏర్పాటు చేశాడు. మీడియా రంగంలోకి అడుగుపెట్టి.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు  సంపాదించాడు. న్యూస్ కొర్ప్, 21సెంచరీ ఫాక్స్ పేరిట మీడియా సంస్థలను ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా సంస్థగా వాటిని అభివృద్ధి చేశాడు.

 అయితే.. 2011లో పలువురు ప్రముఖులు, ప్రజల ఫోన్లను హ్యాక్ చేశారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీని తర్వాత ఆయన 21సెంచరీ ఫ్యాక్స్ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు.

పాట్రిక్ సూన్- షియోంగ్...

పాట్రిక్ సూన్- షియోంగ్.. పుట్టింది దక్షిణాఫ్రికాలో కానీ.. స్థిరపడింది మాత్రం అమెరికాలో.  అతని తల్లిదండ్రులు మాత్రం చైనా దేశానికి చెందినవారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వాళ్లు చైనా నుంచి వలస వచ్చారు.

షియోంగ్.. మెడిసిన్ లో డిగ్రీ చేశారు. ఆ తర్వాత విట్ వాటర్ స్రాండ్ యూనివర్శిటీలో బ్యాచ్ లర్ ఆఫ్ సర్జరీ పూర్తి చేశారు. అక్కడే ఒక ఆస్పత్రిలో ఇంటెన్ షిప్ చేసిన షియోంగ్.. ఆ తర్వాత శిక్షణ నిమిత్తం అమెరికా వచ్చి స్థిరపడ్డారు. ఆ తర్వాత రీసెర్చర్, ప్రొఫెసర్, బిజినెస్ మ్యాన్ గా స్థిరపడ్డాడు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్శిటీ ఆఫ్ లాస్  ఏంజెల్స్ లో వైర్ లెస్ హెల్త్ ఇనిస్టిట్యూట్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

తర్వాత 2007లో ఆయన నాన్ హెల్త్ అనే కంపెనీని స్థాపించారు. జెనెటిక్ డేటాను హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి అందజేయడంలో ఈ కంపెనీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా ఈక్ష్న నాన్ ఓమిక్స్ అనే కంపెనీని కూడా స్థాపించారు. ఇందులోనే క్యాన్సర్ కి మందుని కనుగొన్నారు

ఇలాన్ మస్క్

ఇలాన్ మస్క్.. పుట్టింది దక్షిణాఫ్రికాలో. పెరిగింది కెనడాలో చివరికి అమెరికాలో వచ్చి స్థిరపడ్డాడు. ఫోర్బ్స్ ప్రపంచంలోనే పవర్ ఫుల్ వ్యక్తుల జాబితాలో ఎలోన్ 21వ స్థానంలో నిలిచాడు. ప్రముఖ టెస్లా మోటర్స్, సీటీక్యూ కంపెనీలను స్థాపించి.. వాటికి సీఈవోగా వ్యవహరించాడు ఇలాన్ మస్క్. వీటితో పాటు జిప్2, ఓపెన్ ఏఐ, సోలార్ సిటీ కంపెనీలను కూడా ఆయన స్థాపించాడు. రానున్న 20ఏళ్లలో మనుషులు మార్స్ గ్రహం మీద నివసించేందుకు మస్క్ కృషి చేస్తున్నాడు. అదేవిధంగా మనుషులు  అంతరిక్షంలోకి వెళ్లేందుకు అయ్యే ఖర్చును తగ్గించేందుకు ఆయన కృషి చేస్తున్నాడు.

పియరీ మోరాడ్ ఒమిడియార్..

ఈ-బే కంపెనీ పేరు వినే ఉంటారు. ఈ కంపెనీ ఛైర్మన్ పియర్ మోరాడ్ ఒమిడియార్. పారిస్ లో పుట్టిన ఒమిడియార్ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తతం ఈ-బే కంపెనీ వార్షిక ఆదాయం 8.1బిలియన్ డాలర్లు. తనకు 28ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒమిడియార్ ఈ కంపెనీని ప్రారంభించాడు. మొదట దీనికి యాక్షన్ వెబ్ అనే పేరును పెట్టాడు. తర్వాత దానిని ఈ-బేగా మార్చాడు. ఈ కంపెనీలో మొదట అమ్మిన వస్తువు  పగిలిపోయిన లేజర్ పాయింటర్. ఆ తర్వాత కేవలం 2 సంవత్సరాలలో ఈ-బే కంపెనీ రూపు మారిపోయింది. ఇప్పుడు రోజుకి ఈ కంపెనీ ద్వారా 8లక్షల వస్తువులు అమ్ముడౌతున్నాయి.

 

click me!