ఇప్పటికీ మెజారిటీ అమ్మాయిలకు ‘అదే సమస్య’

First Published Feb 13, 2018, 4:51 PM IST
Highlights
  • ఇటీవలి కాలంలో ఇంగ్లిషును ఆశ్రయించి.. డేట్‌ వచ్చిందనో, పీరియడ్‌ వచ్చిందనో చెప్పేసి, తేలికగా వూపిరి పీల్చుకోవటం మొదలైంది. అయినప్పటికీ ఈ విషయంలో అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ సర్వేలో తేలింది.

కాలం మారినా..మనుషులు అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నా.. ఇప్పటికీ.. అమ్మాయిలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ‘ పీరియడ్స్’ మొదటి వరసలో నిలస్తుంది. ఒకప్పుడు  దాని గురించి బహిరంగంగా మాట్లాడటమే నిషిద్ధం! నలుగురిలో ఉన్నపుడు ఇబ్బంది గురించి ప్రస్తావించ కూడదంటూ బోలెడు ఆంక్షలు.

అందుకే మన సమాజంలో దీనికి ఇంటికో రకంగా, ప్రాంతానికో విధంగా.. నానా రకాల పేర్లూ వినిపిస్తుంటాయి. ‘వాకిట చేరింద’నో, ‘బయట కూర్చుంద’నో, ‘ఇంట్లోకి రాకూడద’నో, ‘ఆ మూడు రోజుల’నో.. ‘ముట్టు అయింద’నో, ‘నెలసరి వచ్చింద’నో.. ఇలా బోలెడన్ని డొంకతిరుగుడు పేర్లు చెబుతుంటారు, అదీ కాస్త గొంతు తగ్గించి, చెప్పకూడనిదేదో చెబుతున్నట్లుగా చెబుతారు.

అయితే కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు కదా? ఈ ఇబ్బందుల్లోకి కూడా కాస్త ఆధునికత ప్రవేశించింది.  ఇటీవలి కాలంలో ఇంగ్లిషును ఆశ్రయించి.. డేట్‌ వచ్చిందనో, పీరియడ్‌ వచ్చిందనో చెప్పేసి, తేలికగా వూపిరి పీల్చుకోవటం మొదలైంది. అయినప్పటికీ ఈ విషయంలో అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ సర్వేలో తేలింది.

ఉమెన్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా.. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే చేసింది. ఆ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. వారి సర్వే ప్రకారం.. ప్రతి ముగ్గురిలో ఒక అమ్మాయి ఇప్పటికీ సానిటర్ పాడ్స్ కొనుక్కోవడంలో ఇబ్బంది పడుతుందని తేలింది. దాదాపు 43 శాతం మంది అమ్మాయిలు.. పీరియడ్స్ మొదటి రోజు సానిటరీ ప్యాడ్స్ సమయానికి దొరకక ఇబ్బంది పడుతున్నారట.

సానిటరీ ప్యాడ్స్..కొనేటప్పుడు షాప్ దగ్గర ఎవరైనా ఉంటే.. దుకాణ యజమానిని  వాటి గురించి అడగడటానికి కూడా 36శాతం మంది ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరంలో కనీసం ఒక్కసారి గానీ, రెండు సార్లు గానీ.. 67శాతం మంది మహిళలు.. సానిటరీ ప్యాడ్స్ ని వేరే వారి దగ్గర నుంచి అప్పుగా తీసుకుంటున్నారు.

బెంగళూరు, చెన్నై, కటక్, ఢిల్లీ, ఇండోర్, జయ్ పూర్, కాన్పూర్, కలకత్తా, లుథియానా, రాంచి, శ్రీనగర్, సూరత్, తిరువనంతపురం సహా 35 పట్టణాల్లో  ఉమెన్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే చేపట్టింది. దేశవ్యాప్తంగా 57.6 శాతం మంది మాత్రమే శానిటరీ పాడ్స్ ఉపయోగిస్తున్నారు. మిగిలిన వారంతా.. ఇప్పటికే పాతకాలం విధానలే అవలంభిస్తున్నారు.

click me!