ఆంజనేయస్వామి దళితుడట.. యోగి సంచలన వ్యాఖ్యలు

By sivanagaprasad kodatiFirst Published Nov 29, 2018, 9:34 AM IST
Highlights

ఇటీవలి కాలంలో నగరాల పేర్లను మారుస్తూ వివాదాల్లో నిలుస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడు ఓ దళిథ గిరిజనుడంటూ ఆయన వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్ని రేపుతోంది.

ఇటీవలి కాలంలో నగరాల పేర్లను మారుస్తూ వివాదాల్లో నిలుస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడు ఓ దళిథ గిరిజనుడంటూ ఆయన వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్ని రేపుతోంది.

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన హనుమంతుడు దళిత గిరిజనుడని.. ఆయన అడవిలో నివసించేవాడని.. రాముడి కోరిక మేరకు తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం వరకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను ఏకం చేయడానికి ప్రయత్నించాడన్నారు.

తాము కూడా రాముడి కోరికను నెరవేర్చేదాకా నిద్రపోమన్నారు. రామభక్తులందరూ బీజేపీకి ఓటేయాలని.. కేవలం రావణుడిని పూజించేవాళ్లు మాత్రమే కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారని ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే యూపీ సీఎం వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓట్ల కోసం కోట్ల మంది దేవుడిగా పూజించే హనుమంతుడికి కులం అంటకట్టడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆదిత్యానాథ్ వ్యాఖ్యలపై రాజస్తాన్‌ సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ లీగలు నోటీసులు పంపింది. మూడు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొంది.

 

అమ్మ క్యాంటీన్, అన్న క్యాంటీన్‌లకు ధీటుగా ‘‘యోగి థాలీ’’

‘‘ముఖ్యమంత్రే నా గురువు’’.. యోగికి పూజ చేసి ఆశీర్వాదం తీసుకున్న పోలీసు.. విమర్శలు

దమ్ముంటే నన్ను కౌగిలించుకో, కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించి : యోగి ఆదిత్యనాథ్

గురు దక్షిణగా.. రోడ్డు వేయించిన యోగి ఆధిత్యనాధ్

మదర్సాలకు యోగి సర్కార్ కీలక ఆదేశాలు

యోగికి బాబా షాక్.. నెక్ట్స్ షాక్ ఎవరిదో..?

అంబేద్కర్ పేరును మారుస్తారట
    

click me!