అరుదైన జబ్బుతో బాధపడుతున్న కాంగ్రెస్ నేత రమ్య

Published : Nov 28, 2018, 03:16 PM IST
అరుదైన జబ్బుతో బాధపడుతున్న కాంగ్రెస్ నేత రమ్య

సారాంశం

సినీనటి, కాంగ్రెస్ నేత రమ్య.. అరుదైన జబ్బుతో బాధపడుతున్నారు. 

సినీనటి, కాంగ్రెస్ నేత రమ్య.. అరుదైన జబ్బుతో బాధపడుతున్నారు.  కన్నడ ప్రముఖ నటుడు అంబరీశ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన అంతిమ వీడ్కోలుకి రమ్య హాజరుకాలేదు. దీంతో.. ఆమె గైర్హాజరు కావడంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. చాలా మంది అంబరీశ్ అభిమానులు ఆమెను నెట్టింట విమర్శల వర్షం కురిపించారు.

కాగా..దీనిపై రమ్య తాజాగా వివరణ ఇచ్చారు.  తన కాలుకి అరుదైన వ్యాధి సోకడం కారణంగా తాను అంబరీశ్ అంకుల్ అంత్యక్రియలకు రాలేకపోయానని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె కాలు నొప్పితో తీవ్రంగా బాధపడుతోందని.. అందుకే అంతిమ వీడ్కోలుకి రాలేదని కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ కూడా చెప్పారు.

రమ్యా ఆస్టియోకాల్‌యటోమా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు పోస్టు పెట్టింది. కాలులోని మూలగకు సంబంధించిన వ్యాధి ఇది. నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. దీంతో ఆమె అక్టోబర్‌ నుంచి విశ్రాంతిలో ఉంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాలుకు శస్త్ర చికిత్స ఫొటోను కూడా పోస్టు చేసి ఒక సందేశం కూడా రాశారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !