రైలు బోగిలో 50 అస్థిపంజరాలు,పుర్రెలు...చైనాకు స్మగ్లింగ్

By Arun Kumar PFirst Published Nov 28, 2018, 4:37 PM IST
Highlights

మానవ అస్థిపంజరాలు, పుర్రెలను రైల్లో తరలిస్తున్న ఓ స్మగ్లర్ ను బీహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుండి దాదాపు 50 అస్థిపంజరాలు, పుర్రెలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అతడు  రోడ్డుమార్గంద్వారా చైనాకు తరలించడానికి ప్రయత్నిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

ఉత్తర ప్రదేశ్ లోని బలియా నుండి సీల్డాకు బయలుదేరిన ఎక్స్ ప్రెస్ రైలులో ప్రసాద్ అనే వ్యక్తి అస్థిపంజరాలు, పుర్రెలను తరలిస్తున్నాడు. ఇతడు బీహార్ నుండి వీటిని భూటాన్ కు తరలించి అక్కడి నుంచి చైనా కు స్మగ్లింగ్ చేయడానికి పథకం వేశాడు. 

అయితే బలియా-సీల్డా ఎక్స్‌ప్రెస్ రైల్లోని ప్రయాణికుల బోగీలో వీటిని తరలిస్తుండగా అనుమానం వచ్చిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో  సారా జిల్లాలోని ఛప్రా రైల్వే స్టేషన్‌లో ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతడు తరలిస్తున్న సంచులను పరిశీలించగా భారీ ఎత్తున అస్థిపంజరాలు, పుర్రెలు కనిపించాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని వీటిని ఎక్కడికి; ఎందుకు తరలిస్తున్నావంటూ పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలోనే ప్రసాద్ వీటిని చైనా కు స్మగ్లింగ్ చేస్తున్నట్లు వెల్లడించాడు.

నిందితుడి నుండి అస్థిపంజరాలే కాకుండా విదేశీ కరెన్సీ, వివిధ దేశాల ఐడీ కార్డులు, విదేశాల సిమ్ కార్డులు, ఏటిఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించి ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.  
 
click me!