చిన్నారిపై రేప్: వలస కూలీలపై దాడులు, ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Oct 7, 2018, 2:35 PM IST
Highlights

 గుజరాత్ రాష్ట్రంలోని ఉపాధి కోసం  వచ్చిన వలసకూలీలపై దాడులు సాగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుండి వలస కూలీలపై  దాడులు పెరగడంతో గుజారాత్ రాష్ట్రాన్ని  వదిలి కూలీలు పారిపోతున్నారు.

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని ఉపాధి కోసం  వచ్చిన వలసకూలీలపై దాడులు సాగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుండి వలస కూలీలపై  దాడులు పెరగడంతో గుజారాత్ రాష్ట్రాన్ని  వదిలి కూలీలు పారిపోతున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని హిమ్మత్‌‌నగర్‌లోని 14 నెలల చిన్నారిపై  వారం రోజుల క్రితం బీహార్ రాష్ట్రానికి చెందిన  వలస కూలీ అత్యాచారానికి పాల్పడడంతో దాడులకు  పాల్పడుతున్నారు. 

గాంధీనగర్, అహ్మదాబాద్, పటాన్, సబర్‌కాంత్, మెహ్సానా ఏరియాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో వలస కూలీలంతా తమ తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు  భారీగా రైల్వేస్టేషన్లకు చేరుకొంటున్నారు. దాడులకు పాల్పడుతున్న సుమారు  150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఉద్రిక్తత నెలకొన్నప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నట్టు  రాష్ట్ర డీజీపీ శివానంద ఝా తెలిపారు.

ఈ దాడులకు ఠాకూర్‌ సేన కారణమంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకుడు, ఠాకూర్‌ సేన అధినేత అల్పేశ్‌ ఠాకూర్‌ వివరణ ఇచ్చారు. తాము శాంతిని మాత్రమే ప్రోత్సహిస్తామని కాంగ్రెస్ నేత ఠాకూర్  చెప్పారు.
 

click me!