శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో రివ్యూ పిటిషన్

Published : Oct 08, 2018, 12:18 PM IST
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో  రివ్యూ పిటిషన్

సారాంశం

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై  రివ్యూ పిటిషన్‌ దాఖలైంది.   

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై  రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. 

జాతీయ అయ్యప్ప భక్తుల అసోసియేషన్ సభ్యులు  సోమవారం నాడు  సుప్రీంకోర్టులో ఈ పిటిషన్  దాఖలు చేశారు.  అయితే సుప్రీంకోర్టు తీర్పుపై  రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిరాకరించింది.

దరిమిలా జాతీయ  అయ్యప్ప భక్తుల అసోసియేషన్ ఈ మేరకు సోమవారం నాడు   రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే  సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు కేరళ సీఎం విజయన్ ఏర్పాటు చేసిన సమావేశానికి  హాజరయ్యేందుకు శబరిమల దేవాలయం, పండలం ప్యాలెస్ అర్చకులు  అంగీకరించలేదు.

ఇదిలా  ఉంటే సుప్రీంకోర్టు తీర్పుపై  కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని  అయ్యప్పభక్తులు  ఆదివారం నాడు చెన్నైలో ఆందోళన నిర్వహించారు.ఇదే విషయమై  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే 2018 సెప్టెంబర్ 28వ తేదీన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం శబరిమల ఆలయంలోకి  మహిళల ప్రవేశాన్ని కల్పిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై మహిళల ఉద్యమం

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి

శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

శబరిమల తీర్పు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జయమాల

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్