స్కూటీపై వెళ్తుండగా.. గాలిపటం దారం మెడకు చుట్టుకుని మహిళా డాక్టర్ దుర్మరణం

By sivanagaprasad kodatiFirst Published Oct 8, 2018, 11:54 AM IST
Highlights

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. గాలి పటాలకు కట్టే మాంజా (దారం) మెడకు చుట్టుకుని మహిళా డాక్టర్ దుర్మరణం పాలయ్యారు. పుణెలోని భోసరీ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల డాక్టర్ కరుపలీ నికమ్ స్కూటీపై వెళ్తుండగా మాంజా మెడకు చుట్టుకుంది

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. గాలి పటాలకు కట్టే మాంజా (దారం) మెడకు చుట్టుకుని మహిళా డాక్టర్ దుర్మరణం పాలయ్యారు. పుణెలోని భోసరీ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల డాక్టర్ కరుపలీ నికమ్ స్కూటీపై వెళ్తుండగా మాంజా మెడకు చుట్టుకుంది.

వాహనంపై వేగంగా వెళ్తుండటం..మెడకు బలంగా బిగుసుకుపోవడంతో ఆమె వాహనం నుంచి కిందపడ్డారు.. దారం కోసుకుపోవడంతో నికమ్ మెడ నుంచి తీవ్ర రక్తస్రావమైంది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే కరుపలీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పక్షులు, జంతవులకేగాక, మనుషుల ప్రాణాలను సైతం తీస్తోన్న చైనా మాంజా (దారం)ను దేశంలోని చాలా రాష్ట్రప్రభుత్వాలు నిషేధించాయి. దీనిని గాజు పెంకుల పొడి, నైలాన్ దారంతో తయారు చేస్తారు.. అందుకే ఇది త్వరగా తెగదు.. మట్టిలో కలిసిపోదు.

click me!