ఫోన్ కోసం సోదరితో గొడవ.. కాలింగ్‌బెల్ నొక్కి...గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య

sivanagaprasad kodati |  
Published : Oct 08, 2018, 10:57 AM IST
ఫోన్ కోసం సోదరితో గొడవ.. కాలింగ్‌బెల్ నొక్కి...గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య

సారాంశం

సెల్‌ఫోన్ విషయంలో సోదిరితో గొడవ పడిన బాలుడు మనస్తాపంతో గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతానికి చెందిన గుల్హన్ అనే బాలుడు శనివారం రాత్రి ఫోన్ కోసం సోదరితో గొడవపడ్డాడు

సెల్‌ఫోన్ విషయంలో సోదిరితో గొడవ పడిన బాలుడు మనస్తాపంతో గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతానికి చెందిన గుల్హన్ అనే బాలుడు శనివారం రాత్రి ఫోన్ కోసం సోదరితో గొడవపడ్డాడు.. ఇద్దరూ ఫోన్ నాకు కావాలంటే నాకు కావాలని గొడవ పడ్డారు.

చివరికి కోపంతో ఫోన్‌ని ధ్వంసం చేసిన గుల్హన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి  కాలింగ్‌బెల్ నొక్కాడు.. అతని తండ్రి వచ్చి తలుపుతు తెరిచి చూసే సరికి ఇంటి ముందు తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్నాడు. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్థారించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. బాలుడి చొక్కా నుంచి నాలుగు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయం మీద తండ్రిని ప్రశ్నించగా.. ఫోన్ విషయంలో గొడవపడి ఇంటి నుంచి అలిగి వెళ్లి... ఆదివారం ఉదయం తాను తలుపులు తీయడానికి కొద్దిసేపటి ముందు కాల్చుకున్నాడని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..బాలుడి చేతికి గన్ ఎలా లభించిందన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌