పెళ్లైన కూతురిపై తండ్రి రేప్: 8 నెలల చిన్నారిని చంపి ఆత్మహత్య

By narsimha lodeFirst Published Sep 5, 2021, 9:36 AM IST
Highlights

బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. పెళ్లైన తర్వాత కూడ కూతురిపై తండ్రి పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో 8 నెలల చిన్నారిని చంపి బాధితురాలు ఆత్మహత్య చేసుకొంది. బాధితురాలి భర్త కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గుర్తించి అతడిని కాపాడారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. కన్నతండ్రే తన కూతురిపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 8 నెలల చిన్నారిని హత్య చేసి ఆ యువతి శనివారం నాడు ఆత్మహత్య చేసుకొంది.

బీహార్ రాష్ట్రంలోని  లఖిబాగ్ ఏరియా పరిధిలో చోటు చేసుకొంది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్  పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆత్మహత్య చేసుకోవడానికి వారం రోజుల ముందు బాధితురాలు ఎస్ఎస్‌పీ గయా మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

భార్యతో పాటు 8 నెలల చిన్నారి చనిపోయిన విషయాన్ని గుర్తించిన బాధితురాలి భర్త కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే స్థానికులు గుర్తించి అతడిని కాపాడారు.తన భార్యపై ఆమె తండ్రి నిరంతరం అత్యాచారం చేశాడని మృతురాలి భర్త తెలిపాడు.ఆమెను ఎవరూ కాపాడలేదన్నారు. ఈ విషయమై తన భార్య ఎస్ఎస్‌పీ గయా మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇది ఇంటి సమస్య అంటూ కేసును పట్టించుకోలేదన్నారు. 

పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆమెపై తండ్రి అత్యాచారం చేశాడని భర్త చెప్పాడు. ఇక చేసేదిలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి భర్త తెలిపారు.నిందితుడు పరారీలో ఉన్నాడు.బాధితురాలి భర్త ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ముఫాసిల్ ఇంచార్జీ కెకెసింగ్ చెప్పారు.

click me!