
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడుతూ ‘మెుంథా’ తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకువస్తోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం అక్టోబర్ 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావంతో గంటకు 90–100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచి, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశలో కదులుతూ, వచ్చే రోజుల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘మెుంథా’ అనే పేరు థాయ్‌లాండ్ సూచించినదిగా, దాని అర్థం “సువాసన పువ్వు” అని వెల్లడించారు. రాబోయే రెండు రోజులలో తీర ప్రాంతాలతో పాటు రాయలసీమలో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆ నిర్ణయం కోర్టు వ్యవహారాల మధ్య నిలిచిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా రద్దయింది.. దీంతో హైకోర్టు ఏం తీర్పునిస్తుందా అని అందరి దృష్టిపడింది. హైకోర్టు తీర్పు నవంబర్ 3న వెలువడనుండగా, దాని అనంతరం నవంబర్ 7న జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తాజా కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయాలని నిర్ణయించింది. దీని కోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3) తొలగింపునకు ఆమోదం తెలిపి, ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ అనుమతికి పంపాలని నిర్ణయించింది.
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తొలిసారిగా కృత్రిమ వర్షం (Artificial Rain) సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించిన ప్రకారం, వాతావరణ శాఖ తెలిపిన సూచనల ఆధారంగా అక్టోబర్ 29న మేఘాలు ఉండే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆ రోజు దిల్లీలో కృత్రిమ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ ప్రయోగం కోసం ఐఐటీ కాన్పూర్, దిల్లీ ప్రభుత్వం కలిసి క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్‌ను రూపొందించాయి.
క్లౌడ్ సీడింగ్ అంటే వెండి అయోడైడ్, డ్రై ఐస్, ఉప్పు వంటి రసాయనాలను ఉపయోగించి మేఘాలను కండెన్స్ చేయించి వర్షం కురిపించే ప్రక్రియ. రేఖా గుప్తా మాట్లాడుతూ, “ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి ఇది శాస్త్రీయ పద్ధతిలో తీసుకున్న ఒక ప్రయత్నం” అని తెలిపారు. అయితే నిపుణుల ప్రకారం ఇది ఖరీదైన విధానం, తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని, చాలా పరిమిత ప్రాంతాల్లోనే ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ వాయు నాణ్యత సూచీ (AQI) 278గా ఉంది, ఇది ‘పూర్’ కేటగిరీలోకి వస్తుంది, కాగా ఆనంద్ విహార్ ప్రాంతంలో 414గా నమోదై ‘సీవియర్’ స్థాయిలో ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది.
భారత త్రివిధ దళాలు ‘త్రిశూల్’ పేరుతో భారీ సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు గుజరాత్ సమీపంలోని సర్‌క్రీక్ ప్రాంతంలో ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ తన గగనతలంలో విమానాల రాకపోకలను పరిమితం చేస్తూ నోటమ్ జారీ చేసింది. విశ్లేషకుడు డామియన్ సైమన్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం, 28వేల అడుగుల ఎత్తు వరకు గగనతలాన్ని భారత దళాలు విన్యాసాల కోసం కేటాయించాయి. ఆపరేషన్ ‘సిందూర్’ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో త్రివిధ దళాలు కలసి నిర్వహించే ఇది మొదటి కసరత్తు. స్వావలంబన, సమన్వయం, సమరసిద్ధతను ప్రదర్శించడమే దీని ఉద్దేశమని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. గుజరాత్ తీరానికి సమీపంలోని ఈ సున్నితమైన సర్‌క్రీక్ ప్రాంతంలో పాక్ కదలికలు పెరిగిన నేపథ్యంలో, ఆ దేశం ఎలాంటి సాహసం చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ ముగిసిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు అందరి దృష్టి టీ20 ఫార్మాట్‌పై పడింది. అక్టోబర్ 29న ఆస్ట్రేలియాతో మొదటి టీ20 మ్యాచ్ కాన్‌బెరాలోని మానుకా ఓవల్‌లో జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఈ సిరీస్‌లో విజయం సాధించి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుండగా, ఆస్ట్రేలియా తమ పర్యటనను విజయవంతంగా ముగించాలనే లక్ష్యంతో ఉంది. మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 31,2,6,8 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
* పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
* ‘అర్జున్ చక్రవర్తి’అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
* విజయ్ ఆంటోనీ నటించిన ‘భద్రకాళి’ జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
* సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ (Janhvi Kapoor) జంటగా తెరకెక్కిన చిత్రం ‘పరమ్ సుందరి’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితో పాటు..
* చల్ జిందగీ (మూవీ) హిందీ
* బిన్ లంగాచి గోస్తా (మూవీ) మరాఠీ
* ది బైక్ రైడర్స్ (మూవీ) ఇంగ్లీష్
* ఈడెన్ (మూవీ) ఇంగ్లీష్/హిందీ
* మాన్‌స్టర్ సమ్మర్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
* ది క్యూబీ అండ్ మీ (మూవీ)ఇంగ్లీష్/తెలుగు
* హోలీ ఘోస్ట్ (మూవీ) ఇంగ్లీష్/హిందీ
* మిడ్‌నైట్ సన్ (మూవీ) కొరియన్
* హోస్ట్ (మూవీ) థాయ్
* లాజరస్ (వెబ్‌సిరీస్:సీజన్1) ఇంగ్లీష్/తెలుగు
* కల్ట్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఫ్రెండ్
* వష్ లెవల్2 (మూవీ) గుజరాతీ/హిందీ
* ఏ హౌస్ ఆఫ్ డైనమైట్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
* ది ఎలిగ్జర్ (మూవీ)ఇంగ్లీష్
* అటాక్ 13 (మూవీ) థాయ్
* కురుక్షేత్ర (వెబ్‌సిరీస్: సీజన్1-పార్ట్2) హిందీ/తెలుగు
* నోబడీ వాంట్స్ ది (వెబ్‌సిరీస్: సీజన్1,2) ఇంగ్లీష్/హిందీ
* ది మాన్‌స్టర్ ఆఫ్ ఫ్లోరెన్సీ (వెబ్‌సిరీస్:సీజన్1) ఇంగ్లీష్/తెలుగు
* బేబీ బండిట్టో (వెబ్‌సిరీస్:సీజన్1,2) స్పానిష్
* జస్ట్ ఏ బిట్ ఎస్పర్స్ (వెబ్‌సిరీస్: సీజన్1) జపనీస్
* మాబ్‌వార్: ఫిలడెల్ఫియా వర్సెస్ ది మాఫియా (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్
* హూ కిల్డ్ ది మాంట్రియల్ ఎక్స్‌పోస్ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్
* గ్యాంబ్లర్స్ (మూవీ) తెలుగు
* అక్యూజ్డ్ (మూవీ) తమిళ్
* జంబో సర్కస్ (మూవీ) కన్నడ
* ది హ్యాండ్ దట్ రాక్స్ ది క్రడెల్ (మూవీ) ఇంగ్లీష్
* నైబర్‌హుడ్ వాచ్ (మూవీ) ఇంగ్లీష్
* ఆస్క్ మి వాట్ యు వాంట్ (మూవీ) స్పానిష్
* ఆర్మ్‌డ్ ఓన్లీ విత్ కెమెరా (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్
* పిచ్ టు గెట్ రిచ్ (రియాల్టీ షో )హిందీ
* వైఫ్ స్వాప్: ది రియల్ హౌస్‌వైవ్స్ ఎడిషన్ (రియాల్టీ షో) ఇంగ్లీష్