ప్రధాని పీఠం కోసమే: మమత దీక్షపై అరుణ్ జైట్లీ విమర్శలు

By Siva KodatiFirst Published Feb 5, 2019, 1:46 PM IST
Highlights

కేసు దర్యాప్తులో భాగంగా కోల్‌కతా సీపీని ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన ధర్నాపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్ల ఫైరయ్యారు. 

కేసు దర్యాప్తులో భాగంగా కోల్‌కతా సీపీని ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన ధర్నాపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్ల ఫైరయ్యారు. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన దీదీని విమర్శించారు.

సీబీఐ విషయంలో మమత ఓవరాక్షన్ అనేక అనుమానాలను కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ చర్య వెనుక మమత వ్యూహమేంటో..? ధర్నాకు విపక్షనేతలను పిలవడం వెనుక అర్థమెంటోనని జైట్లీ ప్రశ్నించారు.

కేవలం పోలీస్ అధికారికి అండగా ఉండేందుకే మమత ధర్నా చేపట్టారనుకుంటే అది పోరపాటేనని.. దీని వెనుక ఆమె ఉద్దేశ్యంత తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకునేందుకు కానీ అరుణ్ జైట్లీ ఆరోపించారు. మమతకు చాలా మంది ప్రతిపక్ష పార్టీల నేతలు మద్ధతు పలికారు.

అందులో చాలా మంది అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వారేనని మండిపడ్డారు. అవినీతి పాలకులంతా ఏకమై దేశాన్ని పాలించాలని ఎత్తుగడలు వేస్తున్నారని జైట్లీ అభిప్రాయపడ్డారు. సిద్ధాంతాలు లేని సంకీర్ణాల వల్ల దేశ భవిష్యత్‌కు విపత్తు లాంటిదని ఆయన అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు.
 

సుప్రీం ఆదేశాలకు తలొగ్గిన మమత బెనర్జీ

అప్పుడు కమ్యూనిష్టులను గడగడలాడించిన మమత.. ఇప్పుడు మోడీపై గురి..!!

చుక్కెదురు: సీబీఐ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

మోడీపై మమత పోరు.. నోరుమెదపని కేసీఆర్: రాములమ్మ ఫైర్

కోల్‌కతా సీపీ నివాసంపై సీబీఐ దాడి..అర్థరాత్రి రోడ్డుపై మమత ధర్నా

అమిత్‌షా పర్యటనలో టీడీపీ నిరసన: శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు

దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్డండి: మోడీకి మమత సవాల్

click me!