సుప్రీం ఆదేశాలకు తలొగ్గిన మమత బెనర్జీ

By narsimha lodeFirst Published Feb 5, 2019, 11:35 AM IST
Highlights

శారదా చిట్‌ఫండ్ కేసులో సీబీఐకు,  బెంగాల్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వాగతించారు


కోల్‌కత్తా:  శారదా చిట్‌ఫండ్ కేసులో సీబీఐకు,  బెంగాల్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వాగతించారు.  ఈ కేసులో తామే నైతిక విజయం సాధించినట్టుగా ఆమె ప్రకటించారు.

మంగళవారం నాడు సుప్రీంకోర్టు తీర్పు  వెలువడిన తర్వాత కోల్‌కత్తాలో ఆమె మీడియాతో మాట్లాడారు.  సీబీఐ విచారణకు కోల్‌కత్తా సీపీ సహకరిస్తారని ఆమె ప్రకటించారు. సీబీఐని మోడీ పావుగా వాడుకొంటున్నారని  ఆమె ఆరోపించారు.

ఇదిలా ఉంటే  ఇవాళ జరిగిన విచారణలో కోర్టు ధిక్కారణ కు పాల్పడినట్టుగా  బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.శారద కుంభకోణం కేసును దర్యాప్తు చేసిన సిట్‌కు సీపీ రాజీవ్ కుమార్  చీఫ్‌గా ఉన్నారు. ఈ సమయంలో సేకరించిన డాక్యుమెంట్లు, ఆధారాలను తమకు  సీపీ ఇవ్వడం లేదని సీబీఐ చెబుతోంది.

సంబంధిత వార్తలు

సీపీకి షాక్: మమత బెనర్జీకి సుప్రీంలో ఎదురు దెబ్బ
 

click me!