march 11-Top Ten News: టాప్ టెన్ వార్తలు

Published : Mar 11, 2024, 06:02 PM IST
march 11-Top Ten News: టాప్ టెన్ వార్తలు

సారాంశం

ఈ రోజు టాప్ టెన్ వార్తలు ఇవే.  

మిషన్ దివ్యాస్త్ర: మోడీ ప్రకటన

పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసారు. డిఆర్డివో శాస్త్రవేత్తలు మిషన్ దివ్యాస్త్రను రూపొందించినట్లు ప్రధాని ప్రకటించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్ (MIRV) టెక్నాలజీతో దేశీయంగానే అగ్ని-5 మిస్సైల్ ను రూపొందించినట్లు ప్రధాని ట్వీట్ చేసారు. పూర్తి కథనం

ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. తాము నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ఆ ఇల్లు మహిళల పేరు మీద ఉంటుందని వివరించారు. పూర్తి కథనం

నేటి నుంచి అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం

పౌరసత్వ సవరణ చట్టాన్ని ఈ రోజు కేంద్ర హోం శాఖ నోటిఫై చేసే అవకాశం ఉన్నదని తెలిసింది. దీంతో ఈ రోజు నుంచే ఈ సవరణ చట్టం అమల్లోకి రానుందని తెలుస్తున్నది. పూర్తి కథనం

నిడదవోలు నుండి కందుల దుర్గేష్ పోటీ

నిడదవోలు అసెంబ్లీ స్థానంలో జనసేన పోటీ చేయనుంది. ఈ మేరకు ఇవాళ జనసేన అధికారికంగా ప్రకటించింది. పూర్తి కథనం

నరసాపురం నుంచి టీడీపీ టికెట్ పై రఘురామ పోటీ

రఘురామకృష్ణం రాజు నరసాపురం నుంచి మళ్లీ లోక్ సభకు పోటీ చేయనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో అనిశ్చిత నెలకొనడంతో రఘురామ పోటీపైనా ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఆయన నరసాపురం నుంచి టీడీపీ టికెట్ పైనే పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. పూర్తి కథనం

ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే

రాజకీయపార్టీలకు విరాళాలు ఇచ్చిన వారి సమాచారాన్ని నిర్ణీత గడవులోపుగా ఈసీకి అందించాలని  సుప్రీంకోర్టు ఎస్‌బీఐని ఆదేశించింది. పూర్తి కథనం

మమ్మల్ని రక్షించండి.. భారత్‌కు నేపాల్ వాసుల విజ్ఞప్తి

రష్యాలో ఉన్న తమను రక్షించాలని  నేపాల్ వాసులు కోరుతున్నారు.  ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను వారు పోస్టు చేశారు. పూర్తి కథనం

దర్శకుడు సూర్య కిరణ్‌ మృతి

దర్శకుడు, నటుడు సూర్య కిరణ్‌ ఈ రోజు చెన్నైలో కన్నుమూశారు. ఆయన కంటికి పంచకామెర్ల వ్యాధితో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. దీంతో చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పూర్తి కథనం

ఐపీఎల్ కు సిద్ధంగా రిషబ్ పంత్ !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో పాల్గొనేందుకు రిషబ్ పంత్ సిద్ధంగా ఉన్నాడు.  ఈ క్ర‌మంలోనే ఎన్సీఏ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా పంత్ రంగంలోకి దిగుతాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి కథనం

స్టార్ హీరోయిన్ తో ప్రేమలో సిద్ధు జొన్నలగడ్డ

డీజే టిల్లు బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. అయితే.. ఆయన ఓ స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి కథనం

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్